ఆ పదవి రాకపోతే రేవంత్ బ్యాచ్ దారెటు ?
కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరూ వెయిటింగ్. పై నుంచి కిందిస్థాయి లీడర్స్ వరకూ… ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ పదవి పీసీసీ చీఫ్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు వస్తారు? అని అందరూ వెయిటింగ్. ఒకవేళ పీసీసీ పదవి రాకపోతే ఏం చేయాలి? ఎటు వైపు వెళ్లాలి? నాలుగేళ్లు ఎన్నికల కోసం ఆగాలా? ఇతర ప్రయత్నాలు చేయాలా? అని కాంగ్రెస్ నేతలు మథన పడుతున్నారు. పీసీసీ రేసులో ప్రధానంగా విన్పిస్తున్న పేర్లు మల్కాజిగిరి […]
కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరూ వెయిటింగ్. పై నుంచి కిందిస్థాయి లీడర్స్ వరకూ… ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ పదవి పీసీసీ చీఫ్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు వస్తారు? అని అందరూ వెయిటింగ్.
ఒకవేళ పీసీసీ పదవి రాకపోతే ఏం చేయాలి? ఎటు వైపు వెళ్లాలి? నాలుగేళ్లు ఎన్నికల కోసం ఆగాలా? ఇతర ప్రయత్నాలు చేయాలా? అని కాంగ్రెస్ నేతలు మథన పడుతున్నారు. పీసీసీ రేసులో ప్రధానంగా విన్పిస్తున్న పేర్లు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొందరు సీనియర్లు మాత్రం ఇతరుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే ఆయనతో పాటు ఆయన వర్గం మొత్తం యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు పీసీసీ ఇస్తే ఏం చేయాలనే దానిపై కొందరు ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారు. పీసీసీ తీసుకోగానే వచ్చే ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనేది రేవంత్ వర్గం టార్గెట్. ఆ తర్వాత మూడేళ్లు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్లాన్ చేయాలనేది ఓ వ్యూహాం. కుదిరితే పాదయాత్ర… లేకపోతే నియోజకవర్గాలు చుట్టేందుకు గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
ఒకవేళ పీసీసీ రాకపోతే ఏం చేయాలి అనే దానిపై కూడా రేవంత్ వర్గం తీవ్ర మథనపడుతోందట. ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోతే ఎన్నికలకు రెండేళ్లముందు ఇవ్వొచ్చు అనేది వారి అంచనా. ఈ రెండేళ్లు ఎలాగో గడిపేస్తే….. అప్పుడు అసలు దూకుడు ప్రదర్శించవచ్చని ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఎనర్జీ వెస్ట్ చేసుకోకుండా ఎన్నికల టైమ్‌లో కష్టపడవచ్చు అనేది వారి ప్లాన్.
మొత్తానికి పీసీసీ పదవి కోసం రేవంత్ బ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరీ కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.