సౌత్ లో బీజేపీ భారీ ప్లాన్... తెలుగు రాష్ట్రాలపైనే గురి?

జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీ.. రాష్ట్రాలకు వచ్చేసరికి బలహీనంగా మారుతోంది. అందుకే.. ప్రాంతీయంగా కొత్త స్నేహాలకు ప్రాధాన్యత ఇచ్చే పనిలో పడింది. దక్షిణాదిలో కర్ణాటక మినహా.. మిగతా రాష్ట్రాల్లో అంతగా ప్రాతినిధ్యం లేని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి వీలైనంతగా బలపడాలని కసరత్తు చేస్తోంది. కొత్తగా.. పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న జేపీ నడ్డా.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దక్షిణాది నుంచి ఎవరైనా ప్రముఖులు తమను కలిసేందుకు దిల్లీకి వస్తే.. తగిన […]

Advertisement
Update:2020-02-25 02:27 IST

జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీ.. రాష్ట్రాలకు వచ్చేసరికి బలహీనంగా మారుతోంది. అందుకే.. ప్రాంతీయంగా కొత్త స్నేహాలకు ప్రాధాన్యత ఇచ్చే పనిలో పడింది. దక్షిణాదిలో కర్ణాటక మినహా.. మిగతా రాష్ట్రాల్లో అంతగా ప్రాతినిధ్యం లేని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి వీలైనంతగా బలపడాలని కసరత్తు చేస్తోంది. కొత్తగా.. పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న జేపీ నడ్డా.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

దక్షిణాది నుంచి ఎవరైనా ప్రముఖులు తమను కలిసేందుకు దిల్లీకి వస్తే.. తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. జనసేన బీజేపీకి దగ్గరైనట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాల్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ శాఖలకు అధ్యక్షులను మార్చేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా.. ఇటీవలే మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధ్యక్షులు మారుతారన్నారు.

ఆయన వ్యాఖ్యలు లోతుగా విశ్లేషిస్తే.. కొన్ని కీలక పరిణామాలపై బీజేపీ దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి.. ప్రతిపక్ష టీడీపీ అంతగా పోటీ ఇవ్వలేకపోతోంది. త్వరలోనే ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అలాగే.. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రమైంది. టీఆర్ఎస్ కు ప్రత్యర్థిగా ఎదిగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించింది.

రాజకీయంగా మరింత బలోపేతం అయ్యేదిశగా కొనసాగించాలన్నదే బీజేపీ నాయకత్వం ఉద్దేశమని.. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి అధ్యక్షులు మారితే.. వారి రాజకీయ ఎత్తులు మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News