‘బాబుకు జైలు... మా వారి కోరిక... త్వరలో నెరవేరాలి’

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. చాలా ఏళ్ల కిందనే ఆమె ఈ విషయంలో న్యాయపోరాటం చేసినా.. స్టే తెచ్చుకున్న చంద్రబాబు సేఫ్ గా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తాజాగా.. అవినీతి నిరోధక శాఖకు చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ అప్పగించాలంటూ ఆమె ఇటీవల ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. వాదనలు వినేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ పై తగిన ఉత్తర్వులను ఇస్తామని […]

Advertisement
Update:2020-02-25 03:07 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. చాలా ఏళ్ల కిందనే ఆమె ఈ విషయంలో న్యాయపోరాటం చేసినా.. స్టే తెచ్చుకున్న చంద్రబాబు సేఫ్ గా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తాజాగా.. అవినీతి నిరోధక శాఖకు చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ అప్పగించాలంటూ ఆమె ఇటీవల ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. వాదనలు వినేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

ఈ పిటిషన్ పై తగిన ఉత్తర్వులను ఇస్తామని ఆ నాడు విచారణ సందర్భంగా చెప్పింది. 26కు విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు గురించి లక్ష్మీ పార్వతి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని అనేవారన్నది ప్రపంచానికి మరోసారి తెలిసేలా చెప్పారు. చంద్రబాబు తనకు చేసిన ద్రోహానికి ఎన్టీఆర్ ఎంతగా ఆవేదన పడ్డారన్నదీ చెప్పారు.

మళ్లీ అధికారంలోకి వస్తే.. బాబును అండమాన్ జైలుకు పంపాలని ఉందని ఎన్టీఆర్ అనేవారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. త్వరలోనే ఆ రోజు వస్తుందని.. రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. కచ్చితంగా చంద్రబాబు, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, సుజనా చౌదరికి శిక్ష పడుతుందని.. వారు జైలుకు వెళ్తే చూడాలని ఉందని లక్ష్మీపార్వతి అన్నారు.

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు రానున్న నేపథ్యంలో.. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News