వెయ్యి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మొనగాడిగా రికార్డు...

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, పోర్చుగీస్ వండర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెయ్యి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మొనగాడిగా రికార్డుల్లో చేరాడు. సిరీ-ఏలీగ్ లో భాగంగా స్పాల్ క్లబ్ తో జరిగిన పోటీలో యువెంటస్ జట్టులో సభ్యుడిగా క్రిస్టియానో బరిలోకి దిగడమే కాదు.. .ఆట 39వ నిముషంలో జువాన్ అందించిన క్రాస్ ను గోల్ గా మలచి.. మరో రికార్డును తన ఖాతాలో జమచేసుకొన్నాడు. 35 సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో 2002 నుంచి […]

Advertisement
Update:2020-02-24 01:31 IST

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, పోర్చుగీస్ వండర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెయ్యి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మొనగాడిగా రికార్డుల్లో చేరాడు.

సిరీ-ఏలీగ్ లో భాగంగా స్పాల్ క్లబ్ తో జరిగిన పోటీలో యువెంటస్ జట్టులో సభ్యుడిగా క్రిస్టియానో బరిలోకి దిగడమే కాదు.. .ఆట 39వ నిముషంలో జువాన్ అందించిన క్రాస్ ను గోల్ గా మలచి.. మరో రికార్డును తన ఖాతాలో జమచేసుకొన్నాడు.

35 సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో 2002 నుంచి 2020 వరకూ స్పోర్టింగ్, రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్, యువెంటస్ క్లబ్ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ… 1000 అంతర్జాతీయ మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు.
ఈ క్రమంలో సిరీ-ఏ లీగ్ లో వరుసగా 11వ సీజన్ ఆడటం ద్వారా.. 21వ గోల్ సాధించాడు.

700కు పైగా గోల్స్…

2019 ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత పోటీలలో భాగంగా జరిగిన యూరోపియన్ జోన్ మ్యాచ్ లో ఉక్రెయిన్ తో జరిగిన పోటీలో 34 ఏళ్ల రొనాల్డో 700 అంతర్జాతీయ గోల్స్ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

పోర్చుగల్ తరపున రొనాల్డోకు ఇది 95వ గోలు కాగా…ఓవరాల్ గా 700 గోల్ కావడం విశేషం. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో …తన దేశం తరపున అత్యధిక గోల్స్ సాధించిన…ఇరాన్ ప్లేయర్ అలీ దాయ్ ( 109 గోల్స్ ) తర్వాతి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు.

తన సుదీర్ఘ కెరియర్ లో 1000 మ్యాచ్ లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో సాధించిన 700కు పైగా గోల్స్ లో…. 457 గోల్స్ వివిధ రకాల 12 టోర్నీల ద్వారా సాధించినవే కావడం విశేషం.

తన కెరియర్ లో ఫుట్ బాల్ ఆడిన మొత్తం సమయంలో ప్రతి 112 నిముషాలకు రొనాల్డో ఓ గోల్ చొప్పున సాధించడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.

స్వీడన్ , లాత్వియా, ఆండోర్రా, అర్మీనియా ప్రత్యర్థులుగా పోర్చుగల్ తరపున రొనాల్డో అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.
తాను రికార్డుల కోసం ఫుట్ బాల్ ఆడనని…స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ వెళితే గోల్స్ వాటంతట అవే వస్తాయని రొనాల్డో ధీమాగా చెబుతున్నాడు.

మరోవైపు…రొనాల్డో ప్రధాన ప్రత్యర్థి లయనల్ మెస్సీ మాత్రం అంతర్జాతీయ ఫుట్ బాల్ లో 1000 గోల్స్ సాధించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

లయనల్ మెస్సీ వ్యక్తిగతంగా 696 గోల్స్ సాధించడంతో పాటు…మరో 309 గోల్స్ సాధించడానికి కారకుడయ్యాడు.

Tags:    
Advertisement

Similar News