ఖేలో ఇండియా యూనివర్శిటీల తొలిక్రీడలు

వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని భారత యువతరాన్ని జాగృతం చేయటానికి కేంద్రప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన ఖేలో ఇండియా గేమ్స్ లో సరికొత్త అధ్యాయానికి భువనేశ్వర్ లో తెరలేచింది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్ర్రాలజట్ల మధ్య ఖేలో ఇండియా గేమ్స్ ను గత మూడుసంవత్సరాలుగా నిర్వహిస్తూ వచ్చిన కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ… తొలిసారిగా భారత్ లోని విశ్వవిద్యాలయాలను భాగస్వాములను చేస్తూ…ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను సైతం నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. భువనేశ్వర్ వేదికగా ఈ క్రడీలను ప్రధాని […]

Advertisement
Update:2020-02-23 05:12 IST
  • వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని

భారత యువతరాన్ని జాగృతం చేయటానికి కేంద్రప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన ఖేలో ఇండియా గేమ్స్ లో సరికొత్త అధ్యాయానికి భువనేశ్వర్ లో తెరలేచింది.

ఇప్పటి వరకూ వివిధ రాష్ట్ర్రాలజట్ల మధ్య ఖేలో ఇండియా గేమ్స్ ను గత మూడుసంవత్సరాలుగా నిర్వహిస్తూ వచ్చిన కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ… తొలిసారిగా భారత్ లోని విశ్వవిద్యాలయాలను భాగస్వాములను చేస్తూ…ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను సైతం నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.

భువనేశ్వర్ వేదికగా ఈ క్రడీలను ప్రధాని నరేంద్ర మోడీ…న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
గతంలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ పేరుతో ఈ క్రీడలను నిర్వహిస్తూ వచ్చారు. తొలిసారిగా విశ్వవిద్యాలయాల క్రీడలను సైతం ఖేలో ఇండియా పరిథిలోకి తీసుకువచ్చారు.

దేశంలోని 159 విశ్వవిద్యాలయాలకు చెందిన 3400 మంది 17 రకాల క్రీడాంశాలలో ఢీ కొనబోతున్నారు. టీమ్ విభాగంలో రగ్బీతో సహా మొత్తం ఏడు రకాల అంశాలను నిర్వహిస్తున్నారు. భారత అంతర్జాతీయ రన్నర్ ద్యుతీ చంద్ సైతం…కిట్ విద్యార్థిని హోదాలో పోటీకి దిగనుంది.

సరికొత్త చరిత్ర…..

భారత క్రీడారంగంలో ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ సరికొత్త చరిత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్భోదించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూఢిల్లీ నుంచి ప్రధాని ఈ క్రీడలను ప్రారంభించారు.

దేశంలోని యువతలో దాగి ఉన్న అపారప్రతిభను వెలికితీయడానికి తాము రెండంచెల క్రీడావ్యవస్థను ఏర్పాటు చేశామని, ఖేలో ఇండియా గేమ్స్ తో పాటు.. ఇప్పుడు ఖేలో యూనివర్శిటీగేమ్స్ నిర్వహించడం సరికొత్త అధ్యాయమని అన్నారు.

మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ట్రిపుల్ జంపర్ జే షా, లాంగ్ జంపర్ నరేంద్ర ప్రతాప్ సింగ్, పూణే విశ్వవిద్యాలయానికి చెందిన రన్నర్ కోమల్ జగ్డాలే, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన రన్నర్ జ్యోతి ఖేలో ఇండియా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో తమ సత్తా చాటుకోబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News