ఇదో కామ కథా చిత్రం... భార్య ఫిర్యాదుతో బయటపడ్డ వ్యవహారం
అతను ఓ బ్యాంకులో క్యాషియర్. లోన్ ల పేరుతో మహిళలను లోబరుచుకోవడం అతనికి అలవాటు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఏకంగా 40 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత.. విషయాన్ని గ్రహించి నిలదీసిన భార్యకు నరకం చూపెట్టాడు. అశ్లీల వీడియోలు విడుదల చేస్తానని బెదిరించాడు. ఆఖరికి ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. విధి లేక.. ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకొచ్చింది. తమిళనాడులో బయటపడిన ఈ వ్యవహారం.. సెక్సువల్ క్రైమ్ కథలకే బాప్ […]
అతను ఓ బ్యాంకులో క్యాషియర్. లోన్ ల పేరుతో మహిళలను లోబరుచుకోవడం అతనికి అలవాటు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఏకంగా 40 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత.. విషయాన్ని గ్రహించి నిలదీసిన భార్యకు నరకం చూపెట్టాడు. అశ్లీల వీడియోలు విడుదల చేస్తానని బెదిరించాడు. ఆఖరికి ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. విధి లేక.. ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకొచ్చింది.
తమిళనాడులో బయటపడిన ఈ వ్యవహారం.. సెక్సువల్ క్రైమ్ కథలకే బాప్ గా నిలుస్తోంది. బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సభ్య సమాజం ఛీ కొట్టే ఈ కామ కథా చిత్రం రియల్ స్టోరీ ఇది.
మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్.. పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలై ఇండియన్ బ్యాంకులో క్యాషియర్. మంచి ఉద్యోగం.. హోదా ఉన్నా కూడా.. సరైన జీవితం గడిపేందుకు ఆయన ప్రయత్నించలేదు. తన ఉద్యోగాన్ని ఎరగా చూపి.. రుణాల పేరుతో మహిళలను లోబరుచుకోవడం అలవాటు చేసుకున్నాడు. తన తల్లి, కుటుంబీకుల సహకారాన్ని కూడా ఇందుకు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తంజావూరు జిల్లాకు చెందిన యువతితో గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు.
వివాహమైన రోజు నుంచే.. జయకుమార్ ప్రవర్తనను అతని భార్య గుర్తించింది. ఇంట్లోనే.. పరాయి మహిళలతో అసభ్య సంభాషణలు.. తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని అర్థం చేసుకుంది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో.. అతని గదిని పరిశీలించగా 15 సెల్ ఫోన్ లు.. దాదాపు 40 మందితో అత్యంత సన్నిహితంగా ఉన్న జయకుమార్ వీడియోలను చూసి షాక్ తింది. నిలదీస్తే.. బెదిరింపే ఆమెకు సమాధానమైంది. అత్తింటి వారూ జయకుమార్ వైపే ఉన్న విషయం అర్థమైంది.
పుట్టింటివారు నిలదీసినా తగిన సమాధానం రాలేదు. పైగా.. ఆమె స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు ఉన్నాయని, వాటిని బయటపెడతామన్న బెదిరింపు ఎదురైంది. తర్వాత.. ఆలయాల సందర్శనకని తీసుకువెళ్లిన భర్త.. తనపై రెండుసార్లు హత్యాయత్నం చేయడంతో.. ఆమె భరించలేకపోయింది. అన్ని సాక్ష్యాలతో ధైర్యం చేసి తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయకుమార్.. అతనికి సహకరించిన సహోద్యోగిని దేవిపై కేసు నమోదైంది.
ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన జయకుమార్.. మదురై కోర్టునుంచి ముందస్తు బెయిల్ పొందగా.. అంతకంటే తెలివిగా వ్యవహరించిన ఆయన భార్య.. ఆధారాలతో సహా అదే కోర్టులో పిటిషన్ వేసింది. వాటిని పరిశీలించిన కోర్టు.. బెయిలుకు వీలు లేని సెక్షన్లపై కేసులేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసులు పెట్టగా.. జయకుమార్ తో కలిపి ఆ ఐదుగురూ పరారయ్యారు. పోలీసులు వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.