భారత్ తో సమరానికి కివీ బుల్లెట్ బౌల్ట్

రెండుమ్యాచ్ ల సిరీస్ కు కౌంట్ డౌన్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా ఫిబ్రవరి 21 నుంచి భారత్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరానికి 13 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టు ఖరారయ్యింది. చేతివేలిగాయంతో గత కొద్దిరోజులుగా జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ను తిరిగి జట్టులోకి తీసుకొన్నారు. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమైన జీత్ రావల్, మైకేల్ సాంట్నర్, ఫాస్ట్ బౌలర్ […]

Advertisement
Update:2020-02-17 05:42 IST
  • రెండుమ్యాచ్ ల సిరీస్ కు కౌంట్ డౌన్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా ఫిబ్రవరి 21 నుంచి భారత్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరానికి 13 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టు ఖరారయ్యింది.

చేతివేలిగాయంతో గత కొద్దిరోజులుగా జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ను తిరిగి జట్టులోకి తీసుకొన్నారు.
ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమైన జీత్ రావల్, మైకేల్ సాంట్నర్, ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ జట్టులో చోటు నిలుపుకోలేకపోయారు. స్పిన్నర్ అజాజ్ పటేల్, జైంట్ ఆల్ రౌండర్ జైమీసన్ లకు చోటు కల్పించారు.

వెలింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే తొలిటెస్టు లో టాప్ ర్యాంకర్ భారత్ కు కివీజట్టు సవాలు విసురుతోంది. బౌల్ట్, టిమ్ సౌథీ,నీల్ వాగ్నర్ లతో కూడిన పేస్ ఎటాక్ తో భారత టాపార్డర్ పై న్యూజిలాండ్ ముప్పేట దాడి చేయనుంది.

కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ టెస్ట్ జట్టు ఆటగాళ్లలో టామ్ బ్లుండేల్, ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డీ గ్రాండ్ హోమీ, జైమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్, రోజ్ టేలర్, నీల్ వాగ్నర్ ఉన్నారు.

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న టెస్ట్ లీగ్ మొదటి మూడు సిరీస్ ల్లోనూ భారత్ తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా 360 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో సైతం భారతజట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకిదిగుతోంది.

Tags:    
Advertisement

Similar News