నేడో రేపో ఢిల్లీకి కేసీఆర్... నిధుల విషయంలో నిలదీస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడో రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ విషయం పక్కాగా కన్ఫమ్. ఇవాళ, రేపు కాకుంటే.. త్వరలోనే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఖాయం. కానీ.. వెళ్లి ఏం చేయబోతున్నారు? నిధుల విషయంలో నిలదీస్తారా? లేక ఇంకేదైనా విషయంలో కేంద్రంతో మాట్లాడతారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు మంత్రి కేటీఆర్.. కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఆర్థిక […]

Advertisement
Update:2020-02-15 04:19 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడో రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ విషయం పక్కాగా కన్ఫమ్. ఇవాళ, రేపు కాకుంటే.. త్వరలోనే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఖాయం. కానీ.. వెళ్లి ఏం చేయబోతున్నారు? నిధుల విషయంలో నిలదీస్తారా? లేక ఇంకేదైనా విషయంలో కేంద్రంతో మాట్లాడతారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఓ వైపు మంత్రి కేటీఆర్.. కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలంటున్నారు. తెలంగాణకు పన్నుల వాటాను కేంద్రం కత్తిరించేయడంపై ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై స్పష్టత లేకపోవడాన్ని తప్పుబట్టారు.

తెలంగాణకు మేం ఇంతగా ఇచ్చాం.. అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సమాధానం చెబితే.. మేం కట్టింది చాలా.. మాకు మీరు ఇచ్చింది కొంతే.. అని సోషల్ మీడియాలో లెక్కలతో సహా ఓ పోస్టు పెట్టి.. చర్చకు తెర తీశారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. తెలంగాణ ప్రభుత్వాన్ని దాదాపుగా అన్నీ తానై నడిపిస్తున్నారు.. అని కేటీఆర్ గురించి సామాజిక మాధ్యమాలు పోస్టులై కూస్తున్న సందర్భంలో… కేసీఆర్ ఢిల్లీ పర్యటన సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రభుత్వ పరంగా.. కేంద్రంతో సన్నిహితంగానే ఉంటామని గతంలో కేసీఆర్ చెప్పారు. ఆ దిశగానే ఇప్పటివరకూ అడుగులు పడ్డాయి. పార్టీల పరంగా మాత్రం రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు.. రాష్ట్రాల్లో అధికారం రాక డీలా పడుతున్న బీజేపీ.. ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. టీఆర్ఎస్ కూడా ఎన్డీయేలో చేరుతుందా.. అన్నది విపరీతంగా వినపడుతున్న ఓ గుసగుస.

ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఈ దిశగా ఏమైనా స్పష్టత వస్తుందా.. లేదంటే మరేదైనా విషయంపై కేసీఆర్ మాట్లాడతారా.. అన్నది ప్రజల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. చూడాలి.. ఏం జరగబోతోందో…!

Tags:    
Advertisement

Similar News