కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కోర్టు ప్రాంగణంలో ఇవాళ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న లక్నో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. అనంతరం అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు జరపగా మరో మూడు నాటు బాంబులు లభించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, సంజీవ్ లోధీ అనే న్యాయవాది లక్ష్యంగా ఈ బాంబు దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. […]

Advertisement
Update:2020-02-13 09:02 IST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కోర్టు ప్రాంగణంలో ఇవాళ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న లక్నో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. అనంతరం అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు జరపగా మరో మూడు నాటు బాంబులు లభించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కాగా, సంజీవ్ లోధీ అనే న్యాయవాది లక్ష్యంగా ఈ బాంబు దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. బాంబు పేలుడు ఘటన జరగడానికి కొద్ది సమయం ముందు సంజీవ్‌పై దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆయనపై దాడికి చేయడానికి వచ్చిన గుర్తు తెలియని అగంతకులు అంతకు ముందు కాల్పులకు కూడా పాల్పడినట్లు కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

జీతూ యాదవ్ అనే మారో న్యాయవాది తనపై బాంబులతో దాడికి పాల్పడ్డట్లు సంజీవ్ ఆరోపిస్తున్నారు. ఇరువురు న్యాయవాదుల మధ్య ఉన్న వైరం కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు శాఖనే కాక.. న్యాయ శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది. బాంబు దాడి జరిగిన ప్రదేశం యూపీ అసెంబ్లీ భవనానికి కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News