అక్బరుద్దీన్ చర్య.. అందరినీ ఆశ్చర్యపరిచిందిలా..!
“ఒక్కసారి పోలీసులను పక్కకు జరిగి చూడమనండి.. హిందువుల సంగతి తేలుస్తాం” అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసి.. దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు అవకాశం ఇచ్చిన నేత ఎవరయ్యా అంటే.. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ అని రాజకీయ, సామాజిక పరిజ్ఞానం కాస్తంత ఉన్నవారెవరైనా చెప్పేస్తారు. అందుకు తగ్గట్టే.. ఓ వర్గ సంక్షేమానికే తాము ప్రతినిధులం అన్నట్టుగా ఆయనతో పాటు.. ఆయన పార్టీ నేతల మాటలు ఉంటాయి. కానీ.. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఓ హిందూ ఆలయ […]
“ఒక్కసారి పోలీసులను పక్కకు జరిగి చూడమనండి.. హిందువుల సంగతి తేలుస్తాం” అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసి.. దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు అవకాశం ఇచ్చిన నేత ఎవరయ్యా అంటే.. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ అని రాజకీయ, సామాజిక పరిజ్ఞానం కాస్తంత ఉన్నవారెవరైనా చెప్పేస్తారు. అందుకు తగ్గట్టే.. ఓ వర్గ సంక్షేమానికే తాము ప్రతినిధులం అన్నట్టుగా ఆయనతో పాటు.. ఆయన పార్టీ నేతల మాటలు ఉంటాయి. కానీ.. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఓ హిందూ ఆలయ అభివృద్ధికి నిధులు కోరి.. అందరికీ షాక్ ఇచ్చారు.. అదే అక్బరుద్దీన్ ఓవైసీ.
నిజం… ఇది నిజంగా నిజం. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు కోరారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. విషయం కాస్తా వైరల్ అయ్యింది. సామాన్యులు సహా.. ప్రముఖుల వరకూ పోస్టులు పెట్టారు. మద్దతుగా మాట్లాడింది కొందరైతే.. ఇది నిజమా అన్నట్టు ట్వీట్లు, పోస్టులు చేసింది మాత్రం చాలా మందే ఉన్నారు.
ఇలా షాక్ గా స్పందించిన వారిలో.. బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ ఒకరు. అక్బరుద్దీన్ మారిపోయాడా.. లేక మాస్క్ వేసుకున్నాడా.. అంటూ ఆమె నేరుగా ట్వీట్ చేశారు. హిందువులను చంపేస్తానని గతంలో వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీనేనా మహంకాళి ఆలయానికి పది కోట్లు ఇవ్వాలని అడిగింది.. అంటూ ఆశ్చర్యంగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ జాబితాలో.. నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత కూడా చేరారు. ఇదంతా ప్రధాని మోదీ ప్రభావమే అంటూ కామెంట్ చేశారు.
మొత్తానికి.. అక్బరుద్దీన్ కు ఎందుకు ఆలోచన వచ్చిందో కానీ.. స్పందన మాత్రం ఇలా మిశ్రమంగా వచ్చింది.