దిశ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ లో ఏకంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.. సోషల్ మీడియాలో తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారంటూ రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భవానీకి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున దిశ పోలీస్ స్టేషన్ కు […]

Advertisement
Update:2020-02-10 11:15 IST

జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ లో ఏకంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.. సోషల్ మీడియాలో తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారంటూ రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

భవానీకి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున దిశ పోలీస్ స్టేషన్ కు వచ్చి సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాదు దిశ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు హల్ చల్ చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం ఉందని.. వెంటనే కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భవానీ పోలీసులను కోరారు.

ఇక అసెంబ్లీ స్పీకర్ కు కూడా టీడీపీ ఎమ్మెల్యే భవానీ ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని…. అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు.

జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ దిశ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News