రంజీట్రోఫీలో 12వేల పరుగుల వాసిం జాఫర్

1996 నుంచి 2020 వరకూ నిత్యనూతనం దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో రికార్డుల మొనగాడు, ముంబై కమ్ విదర్భ ఓపెనర్ వాసిం జాఫర్ తనఖాతాలో మరో అరుదైన రికార్డు జమచేసుకొన్నాడు. రంజీట్రోఫీ చరిత్రలోనే 12వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్ లో జాఫర్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. 2019-20 క్రికెట్ సీజన్ ను 11వేల 775 పరుగుల స్కోరుతో ప్రారంభించిన జాఫర్… ఇప్పటి […]

Advertisement
Update:2020-02-05 06:03 IST
  • 1996 నుంచి 2020 వరకూ నిత్యనూతనం

దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో రికార్డుల మొనగాడు, ముంబై కమ్ విదర్భ ఓపెనర్ వాసిం జాఫర్ తనఖాతాలో మరో అరుదైన రికార్డు జమచేసుకొన్నాడు.

రంజీట్రోఫీ చరిత్రలోనే 12వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్ లో జాఫర్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. 2019-20 క్రికెట్ సీజన్ ను 11వేల 775 పరుగుల స్కోరుతో ప్రారంభించిన జాఫర్… ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లతో 12వేల పరుగుల రికార్డును అందుకోగలిగాడు.

1996-97 టు 2020

1996-97 సీజన్లో ముంబై తరపున రంజీ అరంగేట్రం చేసిన వాసిం జాఫర్ గత 15 సంవత్సరాలుగా తన ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం విదర్భ జట్టుకు ఆడుతున్న వాసిం జాఫర్ 150 రంజీ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా కూడా రికార్డు సాధించాడు.

భారతజట్టులో సభ్యుడిగా 31 టెస్టులు, 2 వన్డేలు ఆడిన జాఫర్… తన చిట్టచివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 2008లో సౌతాఫ్రికా ప్రత్యర్థిగా ఆడాడు.

Tags:    
Advertisement

Similar News