భారత వన్డే జట్టుకు నయా ఓపెనింగ్ జోడీ

మయాంక్- పృథీ షా వన్డే అరంగేట్రం వన్డే క్రికెట్లో భారత ఓపెనర్లు అనగానే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రమే అభిమానులకు గుర్తుకురావడం సహజం. అయితే… న్యూజిలాండ్ తో ప్రారంభమైన ప్రస్తుత తీన్మార్ వన్డే సిరీస్ లో మాత్రం సరికొత్త ఓపెనర్ల జోడీ వెలుగులోకి వచ్చింది. హామిల్టన్ వేదికగా కివీస్ తో తొలివన్డే ద్వారా టెస్ట్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపెనర్లుగా అరంగేట్రం చేశారు. సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో జట్టుకు […]

Advertisement
Update:2020-02-05 05:30 IST
  • మయాంక్- పృథీ షా వన్డే అరంగేట్రం

వన్డే క్రికెట్లో భారత ఓపెనర్లు అనగానే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రమే అభిమానులకు గుర్తుకురావడం సహజం. అయితే… న్యూజిలాండ్ తో ప్రారంభమైన ప్రస్తుత తీన్మార్ వన్డే సిరీస్ లో మాత్రం సరికొత్త ఓపెనర్ల జోడీ వెలుగులోకి వచ్చింది.

హామిల్టన్ వేదికగా కివీస్ తో తొలివన్డే ద్వారా టెస్ట్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపెనర్లుగా అరంగేట్రం చేశారు. సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో… ఇప్పటి వరకూ టెస్టు ఓపెనర్లుగా మాత్రమే బాధ్యతలు నిర్వరించిన మయాంక్, పృధ్వీ షా.. తొలిసారిగా బరిలోకి దిగారు.

ఈ ఇద్దరూ మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అందించినా… యువఓపెనర్ పృధ్వీ షా 20 పరుగులకే అవుటయ్యాడు.

శిఖర్ ధావన్, రోహిత్ శర్మల్లో ఎవరో ఒకరు ఓపెనర్ గా లేకుండా భారతజట్టు ఓ వన్డే సిరీస్ లో పాల్గొనటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి.

Tags:    
Advertisement

Similar News