కరోనా.. రేపిస్టునూ భయపెట్టి పారిపోయేలా చేసింది
కరోనా కథలు ఇంతింత కాదయా.. అన్నట్టుగా ఉంది. వందల మంది రోగులు చనిపోతున్నారు. వేలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఈ వైరస్ బారిన పడి.. విలవిల్లాడుతున్నాయి. మరోవైపు.. సోషల్ మీడియాలో కరోనా గురించి మీమ్స్ రూపంలో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. పల్లెటూళ్లలో చూసినా.. ‘చైనా నుంచి ఏదో రోగం ఒచ్చిందట కదా..’ అన్న చర్చే జరుగుతోంది. ఇలాంటి చర్చలో.. తాజాగా ఓ వింతైన, గమ్మత్తైన సంఘటన జరిగింది. రేపిస్టును […]
కరోనా కథలు ఇంతింత కాదయా.. అన్నట్టుగా ఉంది. వందల మంది రోగులు చనిపోతున్నారు. వేలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఈ వైరస్ బారిన పడి.. విలవిల్లాడుతున్నాయి. మరోవైపు.. సోషల్ మీడియాలో కరోనా గురించి మీమ్స్ రూపంలో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. పల్లెటూళ్లలో చూసినా.. ‘చైనా నుంచి ఏదో రోగం ఒచ్చిందట కదా..’ అన్న చర్చే జరుగుతోంది.
ఇలాంటి చర్చలో.. తాజాగా ఓ వింతైన, గమ్మత్తైన సంఘటన జరిగింది. రేపిస్టును కూడా.. కరోనా వైరస్ భయపెట్టిన విషయం జనాన్ని బాగా ఆకర్షిస్తోంది. ఓ యువతిని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన యువకుడు.. ఆమెకు కరోనా ఉందేమో అన్న భయంతో పరుగు అందుకున్న తీరు.. నవ్వు తెప్పిస్తోంది. ఆ యువతి ప్రదర్శించిన సమయస్ఫూర్తిని ప్రపంచమంతా అభినందిస్తోంది.
ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటారా… కరోనా ఉధృతి కొనసాగుతున్న చైనాలోనే జరిగిందీ ఘటన. జింగ్ షాన్ అనే పట్టణంలో.. ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయం చూసి దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఆ మహిళ.. అతని మొహంపై దగ్గుతూ.. తనకు కరోనా సోకిందని చెప్పిందట. అంతే.. ఆ ఇంట్లో దొరికిన సుమారు 3 వేల యువాన్లతో (చైనా కరెన్సీ) ఆ దుండగుడు ఒకటే పరుగు.
ఈ ముచ్చట ఇక్కడితో ఆగిపోలేదు. ఇందులో మరో వింత కూడా ఉంది. ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఆ దొంగను మాత్రం వారు పట్టుకోలేకపోయారు. కానీ.. ఆ దొంగే.. తన తండ్రితో పాటు కలిసి పోలీసులను కలిసి నేరాన్ని ఒప్పుకోవడం.. లొంగిపోవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.