ముక్కోణపు సిరీస్ లో భారత్ కు కంగారూ దెబ్బ

పెర్రీ ఆల్ రౌండ్ షోలో భారత్ గల్లంతు ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మూడో మ్యాచ్ లో భారత్ కు కంగారూ దెబ్బ తగిలింది. కాన్ బెర్రా వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో ఆతిథ్య ఆస్ట్ర్రేలియా మరో 7 బాల్స్ మిగిలిఉండగానే 4 వికెట్ల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియా…ప్రత్యర్థి భారత్ ను […]

Advertisement
Update:2020-02-03 05:45 IST
  • పెర్రీ ఆల్ రౌండ్ షోలో భారత్ గల్లంతు

ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మూడో మ్యాచ్ లో భారత్ కు కంగారూ దెబ్బ తగిలింది.

కాన్ బెర్రా వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో ఆతిథ్య ఆస్ట్ర్రేలియా మరో 7 బాల్స్ మిగిలిఉండగానే 4 వికెట్ల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియా…ప్రత్యర్థి భారత్ ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగింది.

ఓపెనర్ స్మృతి మంథానా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే భారత్ తరపున రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. కంగారూ ఫాస్ట్ బౌలర్ ఎల్సీ పెర్రీ 4 వికెట్లు, వియామినిక్ 3 వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా 104 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియా మరో 7 బాల్స్ మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకోగలిగింది. ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. పెర్రీ 47 బాల్స్ లో 8 బౌండ్రీలతో 49 పరుగులు సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంది.

మూడుదేశాల ఈటోర్నీ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ ను కంగుతినిపించిన భారత్ కు ఇదే తొలి ఓటమి. 2020 టీ-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకూ జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News