జగన్ ప్రభుత్వం.... నిరుద్యోగులకు ఇస్తోంది మరో వరం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా నియామకాలు చేస్తూ…. నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తోంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా…. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాలు కల్పించింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షల అవకాశాలు సృష్టించింది. ఇందుకు కొనసాగింపుగా…. ఇప్పుడు మరో భారీ స్థాయి నియామకానికి నిర్ణయించింది. త్వరలోనే పోలీసు శాఖలో ఉన్న 15 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హోం శాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, […]

Advertisement
Update:2020-02-03 05:35 IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా నియామకాలు చేస్తూ…. నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తోంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా…. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాలు కల్పించింది.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షల అవకాశాలు సృష్టించింది. ఇందుకు కొనసాగింపుగా…. ఇప్పుడు మరో భారీ స్థాయి నియామకానికి నిర్ణయించింది.

త్వరలోనే పోలీసు శాఖలో ఉన్న 15 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హోం శాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో ఈ మేరకు ఖాళీలున్నట్టు అధికారులు ప్రభత్వానికి నివేదించారు.

వీటిలో కేవలం పోలీసు శాఖ పరిధిలోనే 11 వేలు… అగ్నిమాపక శాఖ పరిధిలో మరో 4 వేల కొలువులు ఉన్నట్టు తేల్చారు.

వీటిని పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం.. త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ లో చోటు కల్పించే అవకాశం ఉంది. దశలవారీగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం… ఈ నెలాఖరులోపు రానుంది. అలాగే.. హోం శాఖ ఉద్యోగాలే కాకుండా… ఏటా డీఎస్సీ వేసి టీచరు పోస్టులు భర్తీ చేసేందుకూ గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటితో ఈ ఏడాది నియామకాల జాతర జరిగేలాగే కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News