ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై రంగంలోకి దిగిన ఈడీ
అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు ప్రాధమిక విచారణలోనే ఈడీ గుర్తించింది. శుక్రవారం నాడు ఈడీ అధికారులు రాష్ట్ర సీఐడీ అధికారులతో సమావేశమై… అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం, 797 మంది తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో కొందరు టీడీపీ నేతలు 761 ఎకరాల భూములను కొనుగోలు చేయడం…. మొదలైన వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీ అధికారుల నుంచి ఈడీ అధికారులు సేకరించారు. సీఐడీ దర్యాప్తులో […]
అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు ప్రాధమిక విచారణలోనే ఈడీ గుర్తించింది.
శుక్రవారం నాడు ఈడీ అధికారులు రాష్ట్ర సీఐడీ అధికారులతో సమావేశమై… అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం, 797 మంది తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో కొందరు టీడీపీ నేతలు 761 ఎకరాల భూములను కొనుగోలు చేయడం…. మొదలైన వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీ అధికారుల నుంచి ఈడీ అధికారులు సేకరించారు.
సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల రిపోర్టుతోపాటు… సీఐడీ అధికారులు సేకరించిన బినామీ వ్యక్తుల వివరాలను కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు.
త్వరలోనే ఈడీ అధికారులు తెల్లరేషన్ కార్డు దారులకు నోటీసులు జారీచేసి వారిని పిలిపించి విచారిస్తారు. వారి విచారణలో… వారిచేత భూములు కొనుగోలు చేయించిన, డబ్బు చెల్లించిన తెలుగుదేశం నేతల పేర్లు ఎలాగూ బయటకు వస్తాయి. అప్పుడు వారిపై చర్యలు తీసుకునేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.