దర్శకుడికి భూమి కేటాయింపు... హైకోర్టు అభ్యంతరం

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెలంగాణకు చెందిన దర్శకుడు, నిర్మాత శంకర్ అధికార టీఆర్ఎస్ తో ఎంతో సాన్నిహిత్యం నెరుపుతుంటాడు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటాడు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా గత ఏడాది జూన్ 21న ఆయకు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలి మోకిల్లా గ్రామంలో స్టూడియోకోసం 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 75 జారీ చేసింది. ఎకరా 5 లక్షల చొప్పున మాత్రమే […]

Advertisement
Update:2020-01-31 06:32 IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెలంగాణకు చెందిన దర్శకుడు, నిర్మాత శంకర్ అధికార టీఆర్ఎస్ తో ఎంతో సాన్నిహిత్యం నెరుపుతుంటాడు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటాడు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా గత ఏడాది జూన్ 21న ఆయకు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలి మోకిల్లా గ్రామంలో స్టూడియోకోసం 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 75 జారీ చేసింది. ఎకరా 5 లక్షల చొప్పున మాత్రమే కేటాయించడం విశేషం.

అయితే శంకర్ కు హైదరాబాద్ శివారులో అంత విలువైన భూమిని 5 లక్షలకే ఎకరం చొప్పున 5 ఎకరాలు కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దీన్ని రద్దు చేయాలని జగిత్యాలకు చెందిన జే శంకర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ప్రదేశంలో మార్కెట్ విలువ ఎకరానికి రూ.5 కోట్ల వరకూ ఉంటుందని.. రిజిస్టర్ వాల్యూ కూడా 20 లక్షలు ఎకరం ఉందని.. ప్రభుత్వం 5 లక్షల చొప్పున భూమిని కేటాయించడం అన్యాయం అని పిటీషన్ లో వాదించారు.

పిటీషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు తాజాగా కేసీఆర్ సర్కారుకు నోటీసులు జారీచేసింది. దీనిపై రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీసీఏల్ఏ తోపాటు దర్శకనిర్మాత అయిన ఎన్ శంకర్ లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News