మంత్రి అవంతి ఆవేదన.... ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ పర్యటక మంత్రి అవంతి శ్రీనివాస్.. టీడీపీ నేతల తీరుపై ఆవేదన చెందారు. తాము అమరావతి అభివృద్ధికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. ‘చేతులెత్తి మొక్కుతున్నా.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయకండి’ అంటూ వేడుకున్నారు. విశాఖపట్నం పరిపాలనకు అనువైన నగరమని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఇలాగే ప్రవర్తిస్తే చంద్రబాబును చరిత్ర క్షమించదంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు విశాఖ పేరును దెబ్బతీసేలా నడుచుకుంటున్నారని […]

Advertisement
Update:2020-01-31 02:56 IST

ఆంధ్రప్రదేశ్ పర్యటక మంత్రి అవంతి శ్రీనివాస్.. టీడీపీ నేతల తీరుపై ఆవేదన చెందారు. తాము అమరావతి అభివృద్ధికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. ‘చేతులెత్తి మొక్కుతున్నా.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయకండి’ అంటూ వేడుకున్నారు.

విశాఖపట్నం పరిపాలనకు అనువైన నగరమని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఇలాగే ప్రవర్తిస్తే చంద్రబాబును చరిత్ర క్షమించదంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు విశాఖ పేరును దెబ్బతీసేలా నడుచుకుంటున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకూ.. మాట్లాడింది ఓ తీరు.. ఇప్పుడు మాట్లాడేది ఓ తీరు అన్నట్టుగా.. మంత్రి అవంతి ఇలా.. టీడీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యానం.. చర్చనీయాంశమైంది. ఇటీవల శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ నూ ఇలాగే చేతులెత్తి నమస్కరిస్తూ.. అమరావతి గురించి మాట్లాడారు.

ఇప్పుడు చంద్రబాబులా ఆగ్రహంతో కాకున్నా.. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే జగన్ లాగే.. మంత్రి అవంతి ఇలా చేతులెత్తి మరీ టీడీపీ వారికి నమస్కరించారు. విశాఖ పేరు దెబ్బతీయవద్దని కోరారు. ఈ చర్చ.. ఇంకెంతదూరం వెళ్తుందో చూడాలి మరి.

Tags:    
Advertisement

Similar News