తగ్గిన ఓటింగ్... టీఆర్ఎస్ లో గుబులు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఆశ్చర్యకరంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పురపాలక సంస్థలలో ఓటింగ్ శాతం తగ్గడం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను షాక్ కు గురిచేస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన నిలబడ్డ వారంతా ఓటేశారా లేదా అన్న టెన్షన్ ఆ పార్టీని పట్టిపీడిస్తోంది. అయితే తెలంగాణ జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ శాతం పెరగడం రాజకీయ వర్గాలను ఉత్సాహపరిచింది. అయితే నిజాంపేట, జవహర్ నగర్, బడాంగపేట్, మణికొండ, జల్పల్లి, […]

Advertisement
Update:2020-01-23 09:34 IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఆశ్చర్యకరంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పురపాలక సంస్థలలో ఓటింగ్ శాతం తగ్గడం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను షాక్ కు గురిచేస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన నిలబడ్డ వారంతా ఓటేశారా లేదా అన్న టెన్షన్ ఆ పార్టీని పట్టిపీడిస్తోంది.

అయితే తెలంగాణ జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ శాతం పెరగడం రాజకీయ వర్గాలను ఉత్సాహపరిచింది. అయితే నిజాంపేట, జవహర్ నగర్, బడాంగపేట్, మణికొండ, జల్పల్లి, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాలల్లో ఓటింగ్ శాతం తగ్గడం ఎవరి కొంప ముంచుతుందోనన్న టెన్షన్ రాజకీయ పార్టీలను పట్టిపీడిస్తోంది.

తెలంగాణలోనే అత్యల్ప ఓటింగ్ శాతం 35% నిజాంపేట మున్సిపాలిటీలో నమోదైంది. ఈ ప్రాంతంలో సచివాలయం, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు నివసిస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా కోస్తా ఆంద్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ కు వీరంతా సపోర్టు చేశారు. కానీ మున్సిపల్ ఎన్నికలపై మాత్రం ఉత్సాహం చూపలేదు. మొత్తం 1.09 లక్షల ఓటర్లలో కేవలం 43వేల మంది మాత్రమే ఓటు వేశారు. 60వేల మందికి పైగా ఓటు వేయకపోవడం గమనార్హం.

ఎన్నికల వేళ సెలవు ఇవ్వడంతో అంతా వీకెండ్ కలిసి వస్తుందని తమ సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో నిజాంపేటలో ఓటింగ్ శాతం తగ్గిపోయిందని భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. దీంతో గులాబీ పార్టీకి టెన్షన్ పట్టుకుంది.

Tags:    
Advertisement

Similar News