పందెం కోడి గాల్లోకి ఎగిరింది.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది!

గోదావరి జిల్లాల్లో.. సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందేలు జోరుగా నడుస్తుంటాయి. అలాగే.. ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు జరిగాయి. వాటిని సరదాగా చూసి ఎంజాయ్ చేద్దామని చాలా మంది ఉత్సాహం చూపారు. ఆ ఉత్సాహమే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఇంట విషాదం నింపింది. ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని పందెం కోడి బలి తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ప్రతి ఏటా మాదిరిగానే […]

Advertisement
Update:2020-01-16 03:33 IST

గోదావరి జిల్లాల్లో.. సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందేలు జోరుగా నడుస్తుంటాయి. అలాగే.. ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు జరిగాయి. వాటిని సరదాగా చూసి ఎంజాయ్ చేద్దామని చాలా మంది ఉత్సాహం చూపారు. ఆ ఉత్సాహమే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఇంట విషాదం నింపింది. ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని పందెం కోడి బలి తీసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా కోడి పందేలు జరిగాయి. భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాల నుంచే కాక.. సుదూర ప్రాంతాల నుంచీ వీటిని చూసేందుకు చాలా మంది హాజరయ్యారు. చిన వెంకటేశు అనే 48 ఏళ్ల వ్యక్తి కూడా.. అక్కడికి వెళ్లిన వారిలో ఉన్నాడు. పుంజులకు కత్తి కడుతుండడాన్ని ఆసక్తిగా గమనించాడు.

ఇంతలో.. ఆ పందెం కోడి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనలో.. చిన వెంకటేశు తొడకు భారీ గాయమైంది. తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. అది వచ్చేసరికే వెంకటేశు ప్రాణం విడిచాడు. గాయం కారణంగానే ఆయన చనిపోయాడని కొందరు చెబుతుండగా.. భారీ మొత్తంలో రక్తాన్ని చూసిన అతడికి గుండెపోటు వచ్చిందని.. అందుకనే ప్రాణం విడిచి ఉంటారని మరి కొందరు చెబుతున్నారు.

ఈ విషయంలో వైద్యులే వాస్తవాన్ని బయటపెట్టాల్సి ఉంది. కానీ.. కారణం ఏదైనా.. ఇలా పందెం కోడి ఎగిరిన తర్వాతే.. వెంకటేశు అలా ప్రాణం పోగొట్టుకోవడం.. అక్కడి పందేల నిర్వాహకులను విషాదంలో ముంచింది. వెంకటేశు కుటుంబసభ్యులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అందుకే.. కోడి పందేల నిర్వాహకులే కాదు.. అక్కడికి వెళ్లి పోటీలు చూసే వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన.. మరోసారి గుర్తు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News