భారత రౌతు ఫవాద్ మీర్జా సరికొత్త చరిత్ర

టోక్యో ఒలింపిక్స్ కు మీర్జా అర్హత అశ్వక్రీడలో భారత సంచలనం ఫవాద్ మీర్జా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గత రెండుదశాబ్దాల కాలంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత అశ్వక్రీడ తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు. 1996, 2000 ఒలింపిక్స్ ఈక్వెష్ట్ర్రియన్ (అశ్వక్రీడ)లో భారత రౌతులు చివరిసారిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒలింపిక్స్ అశ్వక్రీడకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. జకార్తా ఆసియా క్రీడల ఈక్వెష్ట్ర్రియన్ వ్యక్తిగత, టీమ్ విభాగాలలో ఫవాద్ మీర్జా రెండు రజతపతకాలు సాధించాడు. అంతేకాదు…ఆసియా-ఓషియానా […]

Advertisement
Update:2020-01-15 06:50 IST
  • టోక్యో ఒలింపిక్స్ కు మీర్జా అర్హత

అశ్వక్రీడలో భారత సంచలనం ఫవాద్ మీర్జా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గత రెండుదశాబ్దాల కాలంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత అశ్వక్రీడ తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు.

1996, 2000 ఒలింపిక్స్ ఈక్వెష్ట్ర్రియన్ (అశ్వక్రీడ)లో భారత రౌతులు చివరిసారిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒలింపిక్స్ అశ్వక్రీడకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

జకార్తా ఆసియా క్రీడల ఈక్వెష్ట్ర్రియన్ వ్యక్తిగత, టీమ్ విభాగాలలో ఫవాద్ మీర్జా రెండు రజతపతకాలు సాధించాడు. అంతేకాదు…ఆసియా-ఓషియానా జోన్ ప్రాంతంలో టాప్ ర్యాంక్ అశ్వక్రీడాకారుడిగా నిలవడం ద్వారా…టోక్యో ఒలింపిక్స్ లో బెర్త్ ఖాయం చేసుకోగలిగాడు.

భారత్ కు 36 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో రజతపతకం సాధించిపెట్టిన మొనగాడిగా నిలిచాడు. ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తన లక్ష్యం సగం నెరవేరిందని, క్రమబద్దమైన శిక్షణతో అత్యుత్తమ స్థాయిలో రాణించడమే తన ముందున్న లక్ష్యమని ఫవాద్ మీర్జా ప్రకటించాడు.

Tags:    
Advertisement

Similar News