అల్లర్లు సృష్టించేందుకే హైవేల దిగ్బంధం " డీజీపీ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు … హైవేల దిగ్బంధానికి పిలుపునివ్వడంపై డీజీపీ స్పందించారు. రహదారుల దిగ్బంధం పేరుతో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు. అందుకే కొన్ని వర్గాల వారు ఉద్దేశపూర్వకంగా హైవేల ముట్టడికి పిలుపునిచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమైనట్టు వివరించారు. నిరసనలు శాంతియుతంగా చేసుకుంటే అభ్యంతరం లేదని… […]

Advertisement
Update:2020-01-07 05:16 IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు … హైవేల దిగ్బంధానికి పిలుపునివ్వడంపై డీజీపీ స్పందించారు. రహదారుల దిగ్బంధం పేరుతో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.

అందుకే కొన్ని వర్గాల వారు ఉద్దేశపూర్వకంగా హైవేల ముట్టడికి పిలుపునిచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమైనట్టు వివరించారు. నిరసనలు శాంతియుతంగా చేసుకుంటే అభ్యంతరం లేదని… సాధారణ ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలిగించవచ్చని డీజీపీ సూచించారు.

అమరావతి వద్ద టీడీపీ నేతలు హైవేలను దిగ్బంధించేందుకు సిద్ధమవడంతో పోలీసులు అమరావతి ప్రాంత టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. తమను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడంపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బయటకు వెళ్తానని… ఏం చేస్తారో చేసుకోండి అంటూ గుంటూరులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయకూడదని… అన్ని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News