టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. తాజాగా నాదెండ్ల..!

తెలుగుదేశం పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ.. తాజాగా అమరావతి రాజధాని అనే నినాదాన్ని ఎత్తుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఒక పెద్ద ఉద్యమం సృష్టిద్దాం అనుకున్నా.. ఆ ఆందోళనలు కనీసం అమరావతి పరిసరాలు దాటడం లేదు. ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి గతంలోనే ఆదేశాలు అందాయి. కాని గత వారం రోజులుగా […]

Advertisement
Update:2020-01-06 04:22 IST

తెలుగుదేశం పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ.. తాజాగా అమరావతి రాజధాని అనే నినాదాన్ని ఎత్తుకుంది.

మూడు రాజధానుల ప్రతిపాదనపై ఒక పెద్ద ఉద్యమం సృష్టిద్దాం అనుకున్నా.. ఆ ఆందోళనలు కనీసం అమరావతి పరిసరాలు దాటడం లేదు. ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి గతంలోనే ఆదేశాలు అందాయి. కాని గత వారం రోజులుగా అక్కడ విద్యార్థులు అనే వారే కరువయ్యారు.

దీంతో తెలుగునాడు స్టుడెంట్స్ యూనియన్‌(టీఎన్‌ఎస్‌యూ)పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఎన్ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పార్టీకి రాజీమానా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు.

కాగా, గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక సమస్యలపై పోరాడుతున్నానని.. అలాగే తన పోరాటం కొనసాగిస్తానని బ్రహం చౌదరి పేర్కొన్నారు. ఈ రాజీనామా తన సొంత నిర్ణయం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. అమరావతిపై నిర్ణయం గురించి తర్వాత చెప్తానని ఆయన పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News