నేను జగన్ను కాదనుకోలేదు.... మోడీతో ఏం మాట్లాడాననేది చెప్పను!
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంపై.. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తాను ఆర్నెల్లుగా వైకాపాను సమర్థించానని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ ఇప్పటివరకు బాగానే పరిపాలించినట్టు తాను భావిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని.. అందుకే మోదీ, అమిత్ షాను కలిసినట్టు చెప్పారు. దేశానికి ప్రధానిగా మోదీ నాయకత్వం అవసరమని అన్నారు. ”అనంతరం ప్రధాని మోడీతో ఏం మాట్లాడారు.. అమిత్ షా తో ఏం […]
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంపై.. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తాను ఆర్నెల్లుగా వైకాపాను సమర్థించానని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ ఇప్పటివరకు బాగానే పరిపాలించినట్టు తాను భావిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని.. అందుకే మోదీ, అమిత్ షాను కలిసినట్టు చెప్పారు. దేశానికి ప్రధానిగా మోదీ నాయకత్వం అవసరమని అన్నారు.
”అనంతరం ప్రధాని మోడీతో ఏం మాట్లాడారు.. అమిత్ షా తో ఏం మాట్లాడారు.. మీరు బీజేపీలో చేరుతున్నారా? ఈ ఊహాగానాలకు మీ సమాధానం ఏంటి?” అంటూ విలేకరులు.. మోహన్ బాబును ఉక్కిరి బిక్కిరి చేశారు. దీంతో అసలు విషయాన్ని నర్మగర్భంగా ప్రస్తావించిన కలెక్షన్ కింగ్.. ఆర్నెల్లుగా తాను వైకాపాను సమర్థించానని అంటూనే.. ఇంకా చాలా విషయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. తాను మోడీతో, అమిత్ షా తో ఏం మాట్లాడాను.. అన్న విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్పనని.. ఆ విషయంలో ఇబ్బంది పెట్టవద్దని.. అన్నారు. పనిలో పనిగా.. మోడీపై.. అమిత్ షా పై.. ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో తనను మోడీ.. బడే భాయ్.. అని పిలిచారని గుర్తు చేసుకున్నారు. అంతగా తనకు, మోడీకి మంచి సంబంధాలున్నాయన్నారు.
అనంతరం.. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మి మాట్లాడారు. మోడీ జ్ఞాపక శక్తికి హేట్సాఫ్ అన్నారు. దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడామని.. చట్టాలపై ఉన్న అనుమానాలు మోడీకి చెప్పామని అన్నారు. ప్రతి ప్రశ్నకు మోడీ చాలా వివరంగా మాట్లాడారని ప్రశంసించారు. తాము మోడీతో ఏం మాట్లాడామో.. వాటికి మోడీ ఏమని సమాధానాలు చెప్పారో.. అన్న విషయాలను పాయింట్ టు పాయింట్ మీడియాకు విడుదల చేస్తానని మంచు లక్ష్మి చెప్పారు.
ఇదంతా చూస్తుంటే.. మేము అలా మాత్రం అనలేదు.. కానీ.. ఇలా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు.. అని అర్థం వచ్చేలా.. మోహన్ బాబు ఫ్యామిలీ అయోమయాన్ని సృష్టించింది.
ఈ ముగ్గురూ మాట్లాడిన విషయాలను గమనిస్తే.. ఒక్కటి మాత్రం స్పష్టమైంది. ‘మోడీ, అమిత్ షాలతో ఏం మాట్లాడాను అన్నది.. సమయం, సందర్భం చూసి చెబుతా’ అని మోహన్ బాబు చెప్పడంలో అసలు విషయం దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అయోమయానికి తెర పడాలంటే.. మోహన్ బాబు పూర్తిగా మనసు విప్పి మాట్లాడాల్సిందే మరి.