మోహన్ బాబుకు ఏమైంది... జగన్ ను కాదనుకున్నట్టేనా?

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం.. తమకు నచ్చకుంటే మరో పార్టీలోకి వెళ్లిపోవడం మామూలే. వేళ్లపై లెక్కించగలిగినంత నేతలు తప్ప.. చాలామంది ఇలానే ఓ పార్టీలో చేరి.. అవకాశం రాగానే మరో గూటికి చేరిపోతుంటారు. చిరంజీవి అంతటి వ్యక్తే.. ప్రజారాజ్యాన్ని స్థాపించి.. చివరికి పార్టీ నడిపించలేక తన రాజకీయ సంస్థానాన్ని సమస్తం కాంగ్రెస్ లో కలిపేశారు. కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పొంది.. మళ్లీ సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా.. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ అడుగులు.. […]

Advertisement
Update:2020-01-06 10:07 IST

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం.. తమకు నచ్చకుంటే మరో పార్టీలోకి వెళ్లిపోవడం మామూలే. వేళ్లపై లెక్కించగలిగినంత నేతలు తప్ప.. చాలామంది ఇలానే ఓ పార్టీలో చేరి.. అవకాశం రాగానే మరో గూటికి చేరిపోతుంటారు. చిరంజీవి అంతటి వ్యక్తే.. ప్రజారాజ్యాన్ని స్థాపించి.. చివరికి పార్టీ నడిపించలేక తన రాజకీయ సంస్థానాన్ని సమస్తం కాంగ్రెస్ లో కలిపేశారు. కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పొంది.. మళ్లీ సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా.. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ అడుగులు.. ఈ చర్చకు దారి తీస్తున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బంధువు కూడా అయిన మోహన్ బాబు.. గత ఏడాది (2019) మార్చి 26న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ నాయకత్వానికి జై కొట్టారు. వైసీపీ కండువా వేసుకుని.. ఆ పార్టీ నాయకుడిగా కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతకుముందు.. ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా, టీడీపీ నాయకుడిగా, రాజ్యసభ ఎంపీగా మోహన్ బాబుకు చెప్పుకోదగ్గ రాజకీయ జీవితమే ఉంది. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు కీలక బాధ్యతలు దక్కుతాయన్న ప్రచారమూ జరిగింది.

చివరికి.. 2019 ఎన్నికల్లో జగన్ ను నమ్మిన ప్రజలు.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు. తన రాజకీయ లెక్కల్లో ఏనాడూ కాంప్రమైజ్ కాని జగన్.. ఒక్కో స్థానంలో ఒక్కో నేతకు కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గ కూర్పులోనూ.. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించారు. సినీ రంగంలోని పృధ్వి లాంటి వారికీ ఎస్వీబీసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇలాంటి తరుణంలో.. మోహన్ బాబుకు ఏమైందో కానీ.. ఉన్న ఫళంగా ఇవాళ ప్రధాని మోడీని ఢిల్లీలో కుటుంబ సమేతంగా కలిశారు. ఏకంగా 45 నిముషాల పాటు మాట్లాడారు. తనతో పాటు.. కుమారుడు విష్ణు దంపతులు, కుమార్తె మంచు లక్ష్మినీ వెంటతీసుకెళ్లారు.

సీన్ కట్ చేస్తే.. మోహన్ బాబును బీజేపీలో చేరాల్సిందిగా మోడీ ఆహ్వానించారని.. రాజకీయ ప్రాధాన్యత కూడా ఇస్తామని చెప్పారని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే మోహన్ బాబు బీజేపీలో చేరతారన్న ప్రచారమూ జోరందుకుంది. ఈ ఊహాగానాలకు, ప్రచారాలకు మోహన్ బాబు కానీ.. ఆయన కుటుంబం కానీ స్పష్టమైన స్పందన మాత్రం ఇవ్వలేదు. మరి.. జగన్ పై గతంలో వల్లమాలిన ప్రేమను కురిపించిన మోహన్ బాబు.. బీజేపీలో చేరాతారా లేదా అన్నది చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News