కొడాలి నాని సారథ్యంలో మంత్రుల బృందం... ఆందోళనల సంగతి తేల్చేస్తారట...
అమరావతి రైతుల ఆందోళన నిగ్గు తేల్చేందుకు సీఎం జగన్ రెడీ అయినట్లు తెలిసింది. అసలు రైతులు ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక టీడీపీ నేతలు, రియల్టర్లు ఉన్నారా? అనే విషయంపై నిజాలు నిగ్గు తేల్చి ఎండగట్టేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా మంత్రి కొడాలి నాని సారథ్యంలో మంత్రుల బృందానికి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని తాజాగా విలేకరుల సమావేశంలో రాజధాని రైతులకు పిలుపునిచ్చారు. రైతులను చర్చలకు […]
అమరావతి రైతుల ఆందోళన నిగ్గు తేల్చేందుకు సీఎం జగన్ రెడీ అయినట్లు తెలిసింది. అసలు రైతులు ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక టీడీపీ నేతలు, రియల్టర్లు ఉన్నారా? అనే విషయంపై నిజాలు నిగ్గు తేల్చి ఎండగట్టేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.
తాజాగా మంత్రి కొడాలి నాని సారథ్యంలో మంత్రుల బృందానికి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని తాజాగా విలేకరుల సమావేశంలో రాజధాని రైతులకు పిలుపునిచ్చారు. రైతులను చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. డిమాండ్లు వినిపిస్తే న్యాయం చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
జగన్ సర్కారు రాజధాని రైతుల ఆందోళనలకు పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయింది. ఈ మేరకు జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీ కూడా నివేదికలు ఇవ్వడంతో హైపవర్ కమిటీ కూడా పని ప్రారంభించింది. ఈనెల 17 లేదా 18 తేదీల్లో రాజధానిపై హైపవర్ కమిటీ నివేదికను అందించనుంది.
రాజధానిలో రైతుల పేరుతో సాగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ ఆందోళనల గుట్టు విప్పి అసలైన రైతులకు న్యాయం చేసేందుకు వైసీపీ సర్కారు నడుం బిగించింది. ఈ మేరకు చర్చలకు పిలిచింది. ఈ చర్చలకు వచ్చిన అసలైన రైతులకు న్యాయం చేసి… ఫేక్ ఆందోళనకారుల గుట్టు విప్పేందుకు వైసీపీ సర్కారు రెడీ అయ్యింది.