సీఎం చెప్పినా బేఖాతరు... పేషీల్లో ఇంకా పాత వాసనలే...

పాలనపై తనదైన ముద్ర వేయడంతో పాటు అవినీతి విమర్శలకు తావు ఉండకూడదని తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. అందుకు తగ్గట్టు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాటిని ఆచరించే విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం మాటను కూడా లెక్క చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, కీలక అధికారుల పేషీల్లో ఇంకా పాత వారే పాతుకుపోయి కూర్చున్నారు. ఏళ్ల తరబడి పేషీల్లో పాగా వేసి మొత్తం వారి గ్రిప్‌లో ఉంచుకుని ఇష్టానికి వ్యవహారాలు […]

Advertisement
Update:2020-01-06 09:10 IST

పాలనపై తనదైన ముద్ర వేయడంతో పాటు అవినీతి విమర్శలకు తావు ఉండకూడదని తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. అందుకు తగ్గట్టు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాటిని ఆచరించే విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం మాటను కూడా లెక్క చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మంత్రులు, కీలక అధికారుల పేషీల్లో ఇంకా పాత వారే పాతుకుపోయి కూర్చున్నారు. ఏళ్ల తరబడి పేషీల్లో పాగా వేసి మొత్తం వారి గ్రిప్‌లో ఉంచుకుని ఇష్టానికి వ్యవహారాలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడేళ్లకు మించి పేషీల్లో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణం బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. దాంతో డిసెంబర్‌ 31 నాటికి పేషీల్లో బదిలీలు పూర్తి చేయాలని సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

మూడేళ్లకు మించి ఒకే పేషీలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయడం ద్వారా అవినీతి వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు… ఇతరులకూ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వం భావించింది. కానీ గడువు ముగిసినా సరే చాలా పేషీల్లో ఇంకా పాతవారే కొనసాగుతున్నారు. వారే వ్యవస్థను ఆడిస్తున్నారు. పేషీల్లో పాతుకుపోయిన సామాన్య ఉద్యోగులు కూడా ఇతర ఉన్నతాధికారులను ఆడించేలా పరిస్థితి తయారైంది.

పేషీల్లో పాతుకుపోయిన వారిలో చాలా మంది చంద్రబాబు హయాంలో తిష్టవేసిన వారే ఉన్నారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని లీక్‌ చేయడం, పనితీరును దెబ్బతీయడం వంటివి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీల కార్యాలయాల్లో వారే హవా చెలాయిస్తున్నారు. ముఖ్యమంత్రి గట్టిగా పదేపదే చెప్పినా పాత వారిని కదిలించలేకపోవడం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News