రాజకీయాలు శత్రువులను పెంచుతాయి... సినిమా స్నేహితులను పెంచుతుంది

మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నటించిన విజయశాంతిని చూసిన తర్వాత చిరంజీవి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. విజయశాంతి తనకంటే ముందే రాజకీయాల్లోకి వెళ్లిపోయిందని… రాజకీయాల్లో ఉన్న సమయంలో తనను కామెంట్ చేసేదని గుర్తు చేశారు. అలా తనను విమర్శించడానికి మనసెలా వచ్చింది విజయశాంతి? అంటూ ఆమెను సరదాగా ప్రశ్నించారు చిరంజీవి. ఒక మంచి స్నేహితురాలు చాలా కాలం తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. […]

Advertisement
Update:2020-01-06 06:01 IST

మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నటించిన విజయశాంతిని చూసిన తర్వాత చిరంజీవి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. విజయశాంతి తనకంటే ముందే రాజకీయాల్లోకి వెళ్లిపోయిందని… రాజకీయాల్లో ఉన్న సమయంలో తనను కామెంట్ చేసేదని గుర్తు చేశారు. అలా తనను విమర్శించడానికి మనసెలా వచ్చింది విజయశాంతి? అంటూ ఆమెను సరదాగా ప్రశ్నించారు చిరంజీవి.

ఒక మంచి స్నేహితురాలు చాలా కాలం తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను విజయశాంతి కలిసి 20 సినిమాలు చేశామని… చెన్నైలో ఒకే వీధిలో ఉండేవారిమని… సొంత కుటుంబసభ్యుల తరహాలో ఉండేవారిమని గుర్తు చేసుకున్నారు. విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత గ్యాప్ వచ్చిందన్నారు.

రాజకీయాలు శత్రువులను పెంచుతాయని… సినిమా స్నేహితులను పెంచుతుందని… ఈ విషయాన్ని తాను చాలా సీరియస్‌గానే చెబుతున్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమా అన్నది మనషులను దగ్గర చేస్తుందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విజయశాంతి తనను విమర్శించినా తిరిగి ఆమెను ఒక్క మాట అనేందుకు కూడా తనకు మనసు వచ్చేది కాదన్నారు చిరంజీవి.

చిత్రపరిశ్రమలోనూ అందరు హీరోలు, అభిమానులు కలిసిమెలికి ఉండే ఒక మంచి వాతావరణం ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. చిరు వ్యాఖ్యలకు స్పందించిన విజయశాంతి.. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎప్పటికీ చిరంజీవి తన హీరోనే అని విజయశాంతి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News