ఇదేమిటి.... యనమల ఇలా మాట్లాడుతున్నాడు
యనమల మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేస్తున్నాడు. గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రజలకు ఒక అవగాహన కలిగించేలా మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన మాటలు వింటుంటే అంతా అయోమయం గందరగోళం. యనమల ఇలా మాట్లాడుతున్నాడేమిటీ అంటూ…. టీడీపీ వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకు, పెన్షన్‌లకే సరిపోతుందని ఇంకేం మిగలడం లేదని ఆయన […]
యనమల మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేస్తున్నాడు. గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రజలకు ఒక అవగాహన కలిగించేలా మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన మాటలు వింటుంటే అంతా అయోమయం గందరగోళం. యనమల ఇలా మాట్లాడుతున్నాడేమిటీ అంటూ…. టీడీపీ వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకు, పెన్షన్‌లకే సరిపోతుందని ఇంకేం మిగలడం లేదని ఆయన సెలవిచ్చారు. దీనిపై ప్రభుత్వం ఏం చేయాలో చెప్పలేదు.
ఆయన ఉద్దేశం ఉద్యోగులకు జీతలు, పెన్షన్‌లు ఇవ్వవొద్దనా? లేక జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా కొన్ని లక్షల ఉద్యోగాలిచ్చాడనా? అందువల్లే డబ్బంతా జీతాలకే ఖర్చు అయిపోతుంది అనా? ఆయన బాధ ఏంటో స్పష్టంగా చెప్పలేదు.
దీనికి తోడు సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని యనమల విమర్శించాడు. మరోవైపు ఎల్లో మీడియా మాత్రం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఖజానానంతా దోచిపెడుతున్నారని…. ఇన్నిన్ని వెల్‌ఫేర్ స్కీమ్‌లు పెట్టి ప్రజా ధనానంతా ఖర్చుపెట్టేస్తే ఇక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బెక్కడా అని ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వం మీద కుప్పలు తెప్పలుగా వ్యాసాలు రాసేస్తుంటే…. యనమల మాత్రం అందుకు విరుద్దంగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు డబ్బులు తగినంత ఖర్చు పెట్టడం లేదని మాట్లాడుతుంటే టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.
సంక్షేమ పథకాలపై జగన్ ప్రభుత్వం నిధులు కేటాయింపు తగ్గించిందని, పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందని ఆయన వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు.