పిల్లల తర్వాతే టెన్నిస్- కిమ్

ఏడేళ్ల విరామం తర్వాత టెన్నిస్ వైపు చూపు ముగ్గురు పిల్లల తల్లి, బెల్జియం థండర్ కిమ్ క్లిస్టర్స్ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రోటెన్నిస్ బరిలోకి దిగాలని భావిస్తోంది. 2009, 2012 సీజన్లలో కుటుంబం కోసం రిటైర్మెంట్ తీసుకొన్న కిమ్ క్లిస్టర్స్…రీ-ఎంట్రీతో యూఎస్ ఓపెన్, ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. తన వరకూ పిల్లలే ముఖ్యమని, వారి తర్వాతే టెన్నిస్ అని కిమ్ ప్రకటించింది. తనకు మూడేళ్ల నుంచి 11 సంవత్సరాల వయసున్న […]

Advertisement
Update:2020-01-03 02:38 IST
  • ఏడేళ్ల విరామం తర్వాత టెన్నిస్ వైపు చూపు

ముగ్గురు పిల్లల తల్లి, బెల్జియం థండర్ కిమ్ క్లిస్టర్స్ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రోటెన్నిస్ బరిలోకి దిగాలని భావిస్తోంది. 2009, 2012 సీజన్లలో కుటుంబం కోసం రిటైర్మెంట్ తీసుకొన్న కిమ్ క్లిస్టర్స్…రీ-ఎంట్రీతో యూఎస్ ఓపెన్, ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

తన వరకూ పిల్లలే ముఖ్యమని, వారి తర్వాతే టెన్నిస్ అని కిమ్ ప్రకటించింది. తనకు మూడేళ్ల నుంచి 11 సంవత్సరాల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి బాగోగులు, భవిష్యత్ కు భంగం కలగని రీతిలో తన సాధన, టెన్నిస్ కెరియర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలిపింది.

ముందుగా ప్రకటించిన కార్యక్రమం ప్రకారం 2020 జనవరిలోని కిమ్ రీ-ఎంట్రీ చేయాల్సి ఉంది. అయితే మోకాలి నరం గాయంతో రీ-ఎంట్రీని సెప్టెంబర్ నాటికి వాయిదా వేసుకొంది.

తన ఫిట్ నెస్ తగిన విధంగా ఉంటేనే తిరిగి టెన్నిస్ బరిలోకి దిగే అవకాశం ఉందని, ఎంపిక చేసిన కొన్ని టోర్నీలలో మాత్రమే పాల్గొనే ఆలోచన ఉన్నట్లు తెలిపింది.

ఇద్దరు బిడ్డల తల్లిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన కిమ్…ఇప్పుడు ముగ్గురు బిడ్డల తల్లిహోదాలో రీ-ఎంట్రీకి సిద్ధం కావడం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో.. రానున్న కాలమే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News