మ‌ద్యం అమ్మ‌కాల రికార్డు...!

ఓ వైపు ఆర్ధిక‌మాంద్యం అంటున్నారు. కానీ డిసెంబ‌ర్ 31 నాడు జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయేలా సేల్స్ పెరిగాయి. ఆర్ధిక‌మాంద్యంలో కూడా ఎక్సైజ్ శాఖ కు డిసెంబ‌ర్ 31 కాసులు కురిపించింది. రికార్డు స్థాయిలో ఈ సారి మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 31 నుంచి జనవరి 1 వరకు దాదాపు 210 కోట్ల రూపాయల మ‌ద్యం అమ్ముడుపోయిన‌ట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. సాధార‌ణ రోజుల్లో 25 నుంచి 30 కోట్ల రూపాయ‌ల మందు […]

Advertisement
Update:2020-01-02 04:11 IST

ఓ వైపు ఆర్ధిక‌మాంద్యం అంటున్నారు. కానీ డిసెంబ‌ర్ 31 నాడు జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయేలా సేల్స్ పెరిగాయి. ఆర్ధిక‌మాంద్యంలో కూడా ఎక్సైజ్ శాఖ కు డిసెంబ‌ర్ 31 కాసులు కురిపించింది.

రికార్డు స్థాయిలో ఈ సారి మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 31 నుంచి జనవరి 1 వరకు దాదాపు 210 కోట్ల రూపాయల మ‌ద్యం అమ్ముడుపోయిన‌ట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. సాధార‌ణ రోజుల్లో 25 నుంచి 30 కోట్ల రూపాయ‌ల మందు అమ్ముడుపోతే…. ఒక్క 31 నాడే రోజూ అమ్ముడు పోయే మ‌ద్యానికి ఐదు రేట్లు అమ్మ‌కాలు జ‌రిగాయి. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా న్యూఇయర్ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయో తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 31 నాడు ఒక్కరోజులో 1,91,900 మద్యం కేసులు… 2,13,269 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. ఇటీవ‌ల మ‌ద్యం ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం పెంచింది. దీంతో ఆదాయం కూడా పెరిగింది.

గ‌త డిసెంబ‌ర్ నెల‌తో పోలిస్తే.. 2019 డిసెంబ‌ర్ నెల కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. గ‌తంలో కంటే మ‌ద్యం ఎక్కువ అమ్ముడు పోయింది. ఈ ఒక్క నెల‌లోనే 2,047 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇంత‌గా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌లేద‌ని అధికారులు అంటున్నారు.

ఇటు ఏపీలోని కృష్ణాజిల్లాలో కూడా మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగాయి. న్యూఇయర్ వేడుకల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రభుత్వ వైన్స్ ల ద్వారా ఒక్కరోజులో 9 కోట్ల 60 లక్షల ఆదాయం వ‌చ్చింది. కృష్ణాజిల్లాలో గతేడాది కంటే ఆదాయం పెరిగింది.

Tags:    
Advertisement

Similar News