రసపట్టుగా సెంచూరియన్ టెస్ట్
నువ్వానేనా అంటున్న ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ జట్ల మధ్య సెంచూరియన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ మూడోరోజుకే రసపట్టుగా మారింది. ఆధిక్యత చేతులు మారుతూ వచ్చిన ఈమ్యాచ్ లో 376 పరుగుల రికార్డు లక్ష్యంతో రండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 121 పరుగుల స్కోరుతో శుభారంభం చేసింది. అయితే …సెంచూరియన్ పార్క్ లో 251 పరుగుల లక్ష్యం సాధించడమే […]
- నువ్వానేనా అంటున్న ఇంగ్లండ్, సౌతాఫ్రికా
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ జట్ల మధ్య సెంచూరియన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ మూడోరోజుకే రసపట్టుగా మారింది.
ఆధిక్యత చేతులు మారుతూ వచ్చిన ఈమ్యాచ్ లో 376 పరుగుల రికార్డు లక్ష్యంతో రండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 121 పరుగుల స్కోరుతో శుభారంభం చేసింది.
అయితే …సెంచూరియన్ పార్క్ లో 251 పరుగుల లక్ష్యం సాధించడమే కష్టమని గత రికార్డులు చెబుతున్నాయి. ఇంగ్లండ్ జట్టు ప్రతికూల పరిస్థితులను అధిగమించి సంచలన విజయం సాధించాలంటే ఆఖరి రెండురోజుల ఆటలో మరో 255 పరుగులు చేయాల్సి ఉంది.
ఆట నాలుగు, ఐదురోజుల్లో బౌలర్లు మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉంది. మొదటి రెండు రోజుల ఆటలోనే రెండుజట్లూ కలసి 15 వికెట్లు నష్టపోయాయి. మూడోరోజు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు భారీభాగస్వామ్యం
నమోదు చేయగలిగారు.
టెస్ట్ క్రికెట్లో వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన సౌతాఫ్రికా ..ప్రస్తుత సిరీస్ లో తొలివిజయం నమోదు చేయాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.
రసపట్టుగా సాగుతున్న ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ నిలువరించడంతో పాటు సంచలన విజయం సాధించగలరా? అన్నది అనుమానమే.