ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించడం కష్టం.... కానీ...
ఇన్ సైడర్ ట్రేడింగ్.. ఇప్పుడు అమరావతి రాజధాని వేదికగా టీడీపీ నేతలు చేసిన భూదందా సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై తాజాగా వైసీపీ ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. చంద్రబాబు సీఎంగా ఉండగా.. రాజధానిని ముందే అనేసుకొని అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు భూములుకొన్నారు. చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలు తమ బినామీలు, కారు డ్రైవర్లు, పనివాళ్ల పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని సీఎం జగన్ […]
ఇన్ సైడర్ ట్రేడింగ్.. ఇప్పుడు అమరావతి రాజధాని వేదికగా టీడీపీ నేతలు చేసిన భూదందా సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై తాజాగా వైసీపీ ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది.
చంద్రబాబు సీఎంగా ఉండగా.. రాజధానిని ముందే అనేసుకొని అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు భూములుకొన్నారు. చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలు తమ బినామీలు, కారు డ్రైవర్లు, పనివాళ్ల పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.
ఇప్పుడు ఆ వ్యవహారాన్ని సీఎం జగన్ నిన్నటి కేబినెట్ మీటింగ్ లో బయటపెట్టారు. టీడీపీ నేతలు కొన్న 4,070 ఎకరాల భూముల లెక్కలను బయటపెట్టి దానిపై సీబీఐ విచారణకు రెడీ అవుతున్నారు.
దీనిపై తాజాగా వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తూనే ‘లా’ తెలిసిన వ్యక్తిగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో చట్టానికి చంద్రబాబు దొరకడం సాధ్యంకాదని రఘురామకృష్ణం రాజు ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఇప్పుడున్న చట్టాల వల్ల చంద్రబాబును పట్టుకోవడం సాధ్యం కాదని.. చట్టాలు మార్చాలని.. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన బినామీల చట్టం ప్రయోగించాలని జగన్ సర్కారు కు సూచించారు. ఈ చట్టం ద్వారా బినామీలపై చర్యలకు అవకాశం ఉంటుందని.. తద్వారా వారి వెనుకున్న వారు బయటకు వస్తారని తెలిపారు.