2019 వన్డేల్లో షమీ టాప్

21 వన్డేల్లో 42 వికెట్లతో షమీ జోరు ప్రపంచ వన్డే క్రికెట్ 2019 సీజన్లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నంబర్ వన్ గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ల్యూకీ ఫెర్గూసన్, భువనేశ్వర్ కుమార్, షెల్డన్ కోట్రెల్ లాంటి బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా…. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. గత 12 మాసాలలో షమీ ఆడిన మొత్తం 21 వన్డేల్లోనే 42 వికెట్లు పడగొట్టడం విశేషం. 2019 సీజన్లో […]

Advertisement
Update:2019-12-28 03:47 IST
  • 21 వన్డేల్లో 42 వికెట్లతో షమీ జోరు

ప్రపంచ వన్డే క్రికెట్ 2019 సీజన్లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నంబర్ వన్ గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ల్యూకీ ఫెర్గూసన్, భువనేశ్వర్ కుమార్, షెల్డన్ కోట్రెల్ లాంటి బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా…. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.

గత 12 మాసాలలో షమీ ఆడిన మొత్తం 21 వన్డేల్లోనే 42 వికెట్లు పడగొట్టడం విశేషం. 2019 సీజన్లో షమీ సాధించినన్ని వికెట్లు మరే బౌలర్ సాధించలేకపోడం విశేషం.

భారత ఇతర బౌలర్లలో స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్ 32 వికెట్లు, యజువేంద్ర చహాల్ 29 వికెట్లు పడగొట్టారు. 2014 సీజన్లో 38 వన్డే వికెట్లతో టాపర్ గా నిలిచిన షమీ తిరిగి 2019 సీజన్లో సైతం అత్యధిక వికెట్లు సాధించడం విశేషం.

కివీ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తాను ఆడిన 20 వన్డేల్లో 38 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు. కివీ మరో ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ కేవలం 17 వన్డేల్లోనే 35 వికెట్లు సాధించి మూడో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు.

బంగ్లాదేశ్ సీమర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 16 వన్డేల్లో 34 వికెట్లు సాధిస్తే…భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 19 వన్డేల్లో 33 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే ప్రపంచకప్ లో భువనేశ్వర్ కుమార్ ఆరు మ్యాచ్ ల్లో 10 వికెట్లు పడగొడితే…బుమ్రా 18 వికెట్లు, షమీ 14 వికెట్లు, హార్దిక్ పాండ్యా 10 వికెట్లు సాధించారు.

ప్రపంచకప్ లీగ్ దశలో టాపర్ గా నిలిచిన భారత్…సెమీస్ లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో అనుకోని పరాజయం పొంది టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News