ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... ఉల్లిగడ్డలు దొంగతనం చేసి...
ఉన్న వాళ్లను కొల్లగొట్టి లేనివాళ్లకు పెట్టే రాబిన్ హుడ్ కథలను తలపిస్తున్నది ఈ ఇద్దరి యువకుల కథ. ఉల్లిగడ్డలు బంగారం కంటే విలువైనవిగా మారడంతో వాటిని కొల్లగొట్టి జనానికి కారు చౌకగా అమ్ముతూ పోలీసులకు పట్టుపడ్డారు ఇద్దరు యువకులు. అసలేం జరిగిందంటే…. ఉల్లిపాయల ధరలు ఇంకా ఆకాశం నుంచి కిందికి దిగిరాక పోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవ్వడాన్ని చూసి బాధ పడ్డారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకి చెందిన అజయ్ జాతవ్, జీతు వాల్మీకి. తమకు సమీపంలోనే […]
ఉన్న వాళ్లను కొల్లగొట్టి లేనివాళ్లకు పెట్టే రాబిన్ హుడ్ కథలను తలపిస్తున్నది ఈ ఇద్దరి యువకుల కథ. ఉల్లిగడ్డలు బంగారం కంటే విలువైనవిగా మారడంతో వాటిని కొల్లగొట్టి జనానికి కారు చౌకగా అమ్ముతూ పోలీసులకు పట్టుపడ్డారు ఇద్దరు యువకులు.
అసలేం జరిగిందంటే….
ఉల్లిపాయల ధరలు ఇంకా ఆకాశం నుంచి కిందికి దిగిరాక పోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవ్వడాన్ని చూసి బాధ పడ్డారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకి చెందిన అజయ్ జాతవ్, జీతు వాల్మీకి.
తమకు సమీపంలోనే ఉన్న కూరగాయల మార్కెట్‌లోని ఓ గోడౌన్ వారిని ఆకర్షించింది. అందులో ఉండే ఉల్లిని దొంగిలించి జనానికి చౌకగా అందించాలనే ఆలోచన వచ్చింది.
అంతే… ఆరు క్వింటాళ్ల ఉల్లిగడ్డ, ఒక క్వింటాల్ ఎల్లిగడ్డలను దొంగిలించారు. దొంగిలించిన ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డను మరో చోట బహిరంగ మార్కెట్‌లో పది నుంచి ఇరవై రూపాయలకే అమ్ముతూ ఉన్నారు.
ఇంతలో మార్కెట్‌లో ఉల్లి, ఎల్లుల్లి చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులు తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు.
ఇంత చౌకగా ఉల్లిగడ్డలను ఎలా అమ్మగలుగుతున్నారని ప్రశ్నిస్తే… అసలు సంగతి చెప్పారు యువకులు. ఉల్లి ధరలు ఇంతగా పెరగడం తమను తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురిచేసిందని.. అందుకే ఇలా ఉల్లిని దొంగిలించి తక్కువ ధరకే అమ్ముతున్నామని పోలీసులకు చెప్పారు.
యువకులు దొంగిలించిన ఉల్లి విలువ రూ.60,000 ఉంటుందని జనక్‌గంజ్ పోలీసు స్టేషన్ హౌజ్ ఇంచార్జ్ ప్రీతీ భార్గవ్ తెలిపారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు ప్రీతి తెలిపారు.