తర్వాత కేటీఆరే సీఎం.... చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు

కేసీఆర్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని వ్యాఖ్యానించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే తెలంగాణ ప్రజలంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ గేమ్ లేకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే వారిలో కేసీఆర్‌ తర్వాత కేటీఆరే కనిపిస్తున్నారని… కాబట్టి ముఖ్యమంత్రి రేసులో కేటీఆర్‌ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఇప్పుడు వచ్చిన […]

Advertisement
Update:2019-12-27 06:30 IST

కేసీఆర్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని వ్యాఖ్యానించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే తెలంగాణ ప్రజలంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ గేమ్ లేకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే వారిలో కేసీఆర్‌ తర్వాత కేటీఆరే కనిపిస్తున్నారని… కాబట్టి ముఖ్యమంత్రి రేసులో కేటీఆర్‌ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.

కేటీఆర్‌ ఇప్పుడు వచ్చిన నాయకుడు కాదని…ఉద్యమ సమయం నుంచి కూడా ఉన్నారన్నారు. నిమ్స్‌లో కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు నిద్రలేకుండా కాపలా ఉన్న వ్యక్తి కేటీఆర్ అని చెప్పారు. కేటీఆర్ ఒరిజినల్ నాయకుడు అని అభివర్ణించారు. ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఎవరొచ్చినా కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌నే కలుస్తున్నారని వారికి కూడా పరిస్థితి అర్థమైందన్నారు.

కేటీఆర్ సీఎం కాకూడదన్న ఈర్ష, ద్వేషం ఉన్నవారే లేనిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఐదేళ్ల తర్వాతనైనా, పదేళ్ల తర్వాతనైనా తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని చెప్పారు. మతం పేరుతో సమాజాన్ని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మతరాజకీయాలతో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోందని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News