బొత్స ఇంటి ముట్టడి... వచ్చింది 8 మంది కార్యకర్తలు

అమరావతి నుంచి విశాఖకు సచివాలయం తరలింపుపై కేబినెట్ నేడు నిర్ణయం తీసుకోబోతోంది. జీఎన్‌ రావు రిపోర్టుకు ఆమోదం తెలపబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మీడియా గర్జిస్తోంది. సచివాలయం తరలింపుకు ఆమోదం తెలిపితే మంటలే అంటూ కేకలు వేస్తూ రాతలు రాస్తోంది. అయితే ఆందోళనకు… రాజధానిలో కొందరు భూములున్న వారు, టీడీపీ కార్యకర్తల నుంచి మాత్రమే స్పందన వస్తోంది. అమరావతిపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలోని ఆయన ఇంటిని ముట్టడించబోతున్నారని టీవీ చానళ్లు ఊదరగొట్టాయి. బొత్స ఇంటిని […]

Advertisement
Update:2019-12-27 05:27 IST

అమరావతి నుంచి విశాఖకు సచివాలయం తరలింపుపై కేబినెట్ నేడు నిర్ణయం తీసుకోబోతోంది. జీఎన్‌ రావు రిపోర్టుకు ఆమోదం తెలపబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మీడియా గర్జిస్తోంది. సచివాలయం తరలింపుకు ఆమోదం తెలిపితే మంటలే అంటూ కేకలు వేస్తూ రాతలు రాస్తోంది. అయితే ఆందోళనకు… రాజధానిలో కొందరు భూములున్న వారు, టీడీపీ కార్యకర్తల నుంచి మాత్రమే స్పందన వస్తోంది.

అమరావతిపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలోని ఆయన ఇంటిని ముట్టడించబోతున్నారని టీవీ చానళ్లు ఊదరగొట్టాయి. బొత్స ఇంటిని ముట్టడించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు అంటూ బ్రేకింగ్‌లు నడిపింది. కానీ ఆ ముట్టడికి స్పందన లేదు. ఎనిమిది మంది టీఎన్‌ఎస్ఎఫ్ కార్యకర్తలు మాత్రమే బొత్స ఇంటి వద్ద హడావుడి చేశారు. వారిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.

అటు బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ గంట పాటు మౌన దీక్ష చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌ ముగించుకుని ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో గంట పాటు మౌనంగా కూర్చుని ఆపై వెళ్లిపోయారు కన్నా. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టును బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేస్తున్నారు. అమరావతిలోనే వాటిని ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News