ఎవరైనా విశాఖలో నా పేరు వాడితే క్రిమినల్ కేసులు పెట్టండి...

విశాఖలో ఎవరైనా తన పేరు చెప్పుకుని పనులు చేయించుకునేందుకు గానీ, సెటిల్‌మెంట్లు చేసేందుకు గానీ ప్రయత్నిస్తే వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విశాఖ కలెక్టర్, ఎస్పీలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. తాను ఎలాంటి ల్యాండ్ వివాదాల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే ఉండదని… కాబట్టి ఎవరైనా తన పేరు వాడుకునే ప్రయత్నం చేస్తే తక్షణం కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. తనకు విశాఖలో ఒక ఫ్లాట్‌ మాత్రమే ఉందని… అంతకు మించి ఏమీ లేవన్నారు. ఎలాంటి […]

;

Advertisement
Update:2019-12-26 08:53 IST
ఎవరైనా విశాఖలో నా పేరు వాడితే క్రిమినల్ కేసులు పెట్టండి...
  • whatsapp icon

విశాఖలో ఎవరైనా తన పేరు చెప్పుకుని పనులు చేయించుకునేందుకు గానీ, సెటిల్‌మెంట్లు చేసేందుకు గానీ ప్రయత్నిస్తే వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విశాఖ కలెక్టర్, ఎస్పీలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. తాను ఎలాంటి ల్యాండ్ వివాదాల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే ఉండదని… కాబట్టి ఎవరైనా తన పేరు వాడుకునే ప్రయత్నం చేస్తే తక్షణం కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు.

తనకు విశాఖలో ఒక ఫ్లాట్‌ మాత్రమే ఉందని… అంతకు మించి ఏమీ లేవన్నారు. ఎలాంటి వెంచర్లలో కూడా భాగస్వామ్యం లేదని … కాబట్టి తన పేరును ఎవరు వాడుకున్నా ఉపేక్షించవద్దని అధికారులను ఎంపీ కోరారు.

గత ప్రభుత్వంలో విశాఖలో వేల ఎకరాల భూ కుంభకోణాలు జరిగాయని… ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు.

ఈ నెల 28న విశాఖకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వస్తున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుడుతారని వివరించారు. విశాఖ ఉత్సవ్‌లో పాల్గొంటారని విజయసాయిరెడ్డి వివరించారు.

Tags:    
Advertisement

Similar News