ఆశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్... కెమికల్ చల్లి హత్యచేసింది !
చెన్నైలో ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని హత్య చేసింది. తన అశ్లీల వీడియోలు తీసి వివాహం కాకుండా బ్లాక్ మొయిల్ చేస్తున్న వ్యక్తిని హత్యచేసిన యువతి ఉదంతం తాజాగా వెలుగు చూసింది. తిరువెట్రియూర్ సాత్తానకాడు మెట్టుకు చెందిన అమ్మన్ శేఖర్(54) అక్కడే కర్ఫూరం హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు అక్కడి అత్తుమనగర్ కు చెందిన (25) యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. గడిచిన […]
చెన్నైలో ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని హత్య చేసింది. తన అశ్లీల వీడియోలు తీసి వివాహం కాకుండా బ్లాక్ మొయిల్ చేస్తున్న వ్యక్తిని హత్యచేసిన యువతి ఉదంతం తాజాగా వెలుగు చూసింది.
తిరువెట్రియూర్ సాత్తానకాడు మెట్టుకు చెందిన అమ్మన్ శేఖర్(54) అక్కడే కర్ఫూరం హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు అక్కడి అత్తుమనగర్ కు చెందిన (25) యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగింది.
అయితే ఆ యువతికి వేరే యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలియటంతో యువతి తల్లిదండ్రులను బెదిరించి వివాహం క్యాన్సిల్ చేయించాడు. అంతేకాకుండా ఇంకోసారి వేరే వ్యక్తులతో వివాహం అంటూ ప్రయత్నాలు చేస్తే ఆమెతో ఉన్న అశ్లీల వీడియోలు బయటపెడతానని బెదిరించాడు.
దీంతో బయపడిన ఆ యువతి కొన్నిరోజులుగా శేఖర్ ను నమ్మించి మంగళవారం రాత్రి… రోజూ వాళ్ళు కలిసే చోటుకు రమ్మంది. యువతి చెప్పినట్లు సమీపంలో ప్లేగ్రౌండ్ కు వెళ్లిన శేఖర్ ముఖంపై సృహ తప్పేలా కెమికల్ చల్లింది. దీంతో సృహతప్పిన అనంతరం స్నేహితుల సాయంతో శేఖర్ ను హత్యచేసింది.
బుధవారం ఉదయం ప్లేగ్రౌండ్ లో రక్తపుమడుగులో పడివున్న శేఖర్ శవాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. లోతుగా విచారించిన పోలీసులకు శేఖర్ హత్యకు వెనుక యువతి ప్రమేయం ఉన్నట్లు తెలియటంతో అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.