అమరావతి వేస్ట్‌ అని ఎప్పుడో చెప్పాం... పోలవరం నిర్వాసితుల కంటే రాజధాని రైతులది పెద్ద త్యాగమా?

అమరావతిలో రాజధాని నిర్మాణం చెత్త, అది వేస్ట్ అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని వ్యాఖ్యానించారు ఆర్థిక నిపుణులు పెంటపాటి పుల్లారావు. పెద్ద రాజధాని ఏపీకి అవసరం లేదన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని పెట్టడం వల్ల పెద్దపెద్ద భవనాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని రైతుల పట్ల కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం నిర్వాసితులు, భోగాపురం నిర్వాసితుల కంటే రాజధాని రైతులది పెద్ద త్యాగమా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం లక్షల ఎకరాలు ఇచ్చారని… వారికి […]

Advertisement
Update:2019-12-25 06:08 IST

అమరావతిలో రాజధాని నిర్మాణం చెత్త, అది వేస్ట్ అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని వ్యాఖ్యానించారు ఆర్థిక నిపుణులు పెంటపాటి పుల్లారావు. పెద్ద రాజధాని ఏపీకి అవసరం లేదన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని పెట్టడం వల్ల పెద్దపెద్ద భవనాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు.

రాజధాని రైతుల పట్ల కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం నిర్వాసితులు, భోగాపురం నిర్వాసితుల కంటే రాజధాని రైతులది పెద్ద త్యాగమా అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు కోసం లక్షల ఎకరాలు ఇచ్చారని… వారికి ఇంకా నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. తనకైతే రాజధాని రైతులను చూస్తుంటే కన్నీరు రావడం లేదన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో పరిపాలన కోసం వీలైనంత తక్కువ ఖర్చుతో ఏర్పాట్లు చేయడమే మంచిదన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాజధాని ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదన్నారు. పరిపాలన భారం తగ్గించేందుకు… విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం సరైన చర్యే అని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికైనా ఏపీపై రాజధాని పేరుతో భారం లేకుండా తగ్గిస్తేనే ఏపీ ముందుకెళ్తుందన్నారు. అలా కాకుండా ఏపీని రియల్ ఎస్టేట్‌ రాష్ట్రంగా మార్చుకుంటే అనేక ఇబ్బందులొస్తాయని పెంటపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News