40 ఇయర్స్ ఇండస్ట్రీ.... ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కావట్లేదట...!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మ‌ళ్లీ డైలామాలో ప‌డ్డారు. రాజ‌ధానిపై ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. పార్టీ ప‌రంగా ఏం చేయాలో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబుది ఇదే వైఖ‌రి. తెలంగాణ‌లో పార్టీని కాపాడుకోవాలి…. ఏపీలో పార్టీకి ఇబ్బందిరావద్దు…. ఇందుకోసం రెండు క‌ళ్ల సిద్దాంతం చెప్పేవారు. ఇప్పుడు రాజ‌ధానిపై చంద్రబాబు ఏ సిద్దాంతంతో ముందుకు పోవాలో తెలియ‌క… అమ‌రావ‌తి, విశాఖ‌, క‌ర్నూలులో తానే ఉండాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. నిన్న మొన్న‌టి దాకా […]

Advertisement
Update:2019-12-25 06:15 IST

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మ‌ళ్లీ డైలామాలో ప‌డ్డారు. రాజ‌ధానిపై ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. పార్టీ ప‌రంగా ఏం చేయాలో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతున్నారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబుది ఇదే వైఖ‌రి. తెలంగాణ‌లో పార్టీని కాపాడుకోవాలి…. ఏపీలో పార్టీకి ఇబ్బందిరావద్దు…. ఇందుకోసం రెండు క‌ళ్ల సిద్దాంతం చెప్పేవారు.

ఇప్పుడు రాజ‌ధానిపై చంద్రబాబు ఏ సిద్దాంతంతో ముందుకు పోవాలో తెలియ‌క… అమ‌రావ‌తి, విశాఖ‌, క‌ర్నూలులో తానే ఉండాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. నిన్న మొన్న‌టి దాకా క‌ర్నూలు టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు రాలేదు. కానీ ఇప్పుడు అఖిల‌ప్రియ, కోట్ల సుజాత‌మ్మ‌లు ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. వీరి ప్ర‌క‌ట‌న‌ల వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌నేది ఆ పార్టీ నేత‌ల అనుమానం.

ఇటు విశాఖ‌లో టీడీపీ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. విశాఖ‌లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాల‌ని తీర్మానించారు. అయితే అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అనే స‌న్నాయి నొక్కులు ఇక్క‌డి నుంచి ప్రారంభ‌మ‌య్యాయ‌.

ఇటు రాజ‌ధానిలో టీడీపీ నేత‌లు, త‌న సామాజిక‌వర్గ మ‌హిళ‌ల‌తో ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌బాబు కొన‌సాగిస్తున్నారు.

మొత్తానికి చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఇప్పుడు ఏ సిద్దాంతంతో ముందుకు పోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఏ ప్రాంతంలో త‌న‌పై వ్య‌తిరేక‌త వ‌స్తుందో తెలియ‌క‌….ఏ స్టాండ్ తీసుకోవాలో అర్ధంకాక ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ప‌రీక్ష‌లు ఎదుర్కొంటున్నారు.

మొత్తానికి తెలంగాణ ఉద్య‌మ సమ‌యంలో ఎలా చ‌క్ర‌బంధంలో చిక్కుకున్నారో…ఇప్పుడు దానికి మించిన చిక్కులు చంద్రబాబును చుట్టుముట్టాయి.

Tags:    
Advertisement

Similar News