విరాట్ కొహ్లీ-రోహిత్ శర్మ సూపర్ హిట్

2019 సీజన్లో ఇద్దరూ ఇద్దరే భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ…2019 సీజన్ ను ఘనంగా ముగించారు. తమతమ కెరియర్ లలో అత్యుత్తమంగా రాణించిన సంవత్సరాలలో 2019 ఒకటంటూ ప్రకటించారు. వెస్టిండీస్ తో కటక్ లో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో కెప్టెన్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా తమ జట్టు సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించారు. కెప్టెన్ కొహ్లీ […]

Advertisement
Update:2019-12-24 09:23 IST
  • 2019 సీజన్లో ఇద్దరూ ఇద్దరే

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ…2019 సీజన్ ను ఘనంగా ముగించారు. తమతమ కెరియర్ లలో అత్యుత్తమంగా రాణించిన సంవత్సరాలలో 2019 ఒకటంటూ ప్రకటించారు.

వెస్టిండీస్ తో కటక్ లో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో కెప్టెన్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా తమ జట్టు సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించారు.

కెప్టెన్ కొహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిస్తే….వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకొన్నారు.

త్రీ-ఇన్-వన్ విరాట్ కొహ్లీ…

ప్రపంచ నంబర్ వన్ స్టార్ విరాట్ కొహ్లీ 2019 సీజన్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

కొహ్లీ ఓ డబుల్ సెంచరీతో సహా మొత్తం 7 శతకాలతో 2455 పరుగులతో టాప్ రన్ గెటర్ గా నిలిచాడు. కొహ్లీ ఆడిన 26 వన్డేలలో 1377 పరుగులు, 8 టెస్టుల్లో 612 పరుగులు, 10 టీ-20ల్లో 466 పరుగులు సాధించడం ద్వారా ఇటు టెస్టుల్లోనూ… అటు వన్డేల్లోనూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా సీజన్ ను ముగించగలిగాడు.

రెండోస్థానంలో రోహిత్….

భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండోస్థానంలో నిలిచాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కలిసి రోహిత్ 2442 పరుగులు సాధించడం విశేషం.

రోహిత్ ఆడిన 28 వన్డేల్లో 1490 పరుగులు, 5 టెస్టుల్లో 556 పరుగులు, 14 టీ-20ల్లో 396 పరుగులు సాధించడం విశేషం.

సెంచరీల మొనగాడు రోహిత్….

2019 సీజన్లో అత్యధికంగా 10 శతకాలు బాదిన ఘనతను రోహిత్ శర్మ సొంతం చేసుకొన్నాడు. ఇందుల్లో వన్డేల్లో 7 సెంచరీలు, టెస్టుల్లో మూడు సెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లోనే రోహిత్ ఐదు సెంచరీలు సాధించాడు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 7 శతకాలతో రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

2019 సీజన్ తమ కెరియర్ లోని అత్యుత్తమ సీజన్లలో ఒకటని… 2020 సీజన్లో సైతం ఇదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నామని ఇటు కొహ్లీ, అటు రోహిత్ శర్మ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News