బాబుకు షాక్... జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన గంటా

విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు మరోసారి మంగళవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ కుండబద్దలు కొట్టడం సంచలనంగా మారింది. విశాఖపట్నం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని… ఇది ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రజలకు నివాసంగా ఉందని.. ఇది చాలా ప్రశాంతమైన నగరం అని గంటా శ్రీనివాసరావు అన్నారు. దీనిని పరిపాలనా రాజధానిగా చేస్తే, మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని […]

Advertisement
Update:2019-12-24 10:47 IST

విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు మరోసారి మంగళవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ కుండబద్దలు కొట్టడం సంచలనంగా మారింది.

విశాఖపట్నం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని… ఇది ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రజలకు నివాసంగా ఉందని.. ఇది చాలా ప్రశాంతమైన నగరం అని గంటా శ్రీనివాసరావు అన్నారు. దీనిని పరిపాలనా రాజధానిగా చేస్తే, మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని గంటా నొక్కిచెప్పారు. ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని మరోసారి స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు.

ఇదివరకే విశాఖను రాజధాని చేయడంపై ట్విట్టర్ లో స్పందించిన గంటా తాజాగా బయటకు వచ్చి సపోర్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు అమరావతి రాజధానిని మార్చడంపై రైతుల ఆందోళనల్లో పాల్గొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని మార్చనీయమని రాజకీయ మైలేజీని పొందడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు రాజధాని రైతుల హక్కుల కోసం పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

ఓవైపు చంద్రబాబు రాజధాని మార్చడంపై పోరాటం చేస్తున్నా… ఆయన పార్టీలోని సీనియర్ ఇలా వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది. గంటా పార్టీ మారబోతున్నాడా? అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News