ఉలుకుపలుకు లేని చినబాబు....

రాష్ట్రంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఇద్దరు ఆడవాళ్ళు నీటి కుళాయి వద్ద గొడవ పడినా ఆ విషయంపై ట్విట్టర్‌లో స్పందించి దెబ్బలు తిన్న ఆమె టీడీపీ, కొట్టిన ఆమె వైసీపీ… చూశారా జగన్‌ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి అంటూ స్పందించే నారా లోకేష్… ఎక్కడో ఒక చోట ఒక వైసీపీ కార్యకర్త జగన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తే…. చూశారా జగన్‌ పాలన సొంత మనుషులకే నచ్చలేదని ట్వీట్టు పెట్టే నారా లోకేష్… గత కొద్దిరోజులుగా ఉలుకుపలుకు లేరు. […]

Advertisement
Update:2019-12-23 03:51 IST

రాష్ట్రంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఇద్దరు ఆడవాళ్ళు నీటి కుళాయి వద్ద గొడవ పడినా ఆ విషయంపై ట్విట్టర్‌లో స్పందించి దెబ్బలు తిన్న ఆమె టీడీపీ, కొట్టిన ఆమె వైసీపీ… చూశారా జగన్‌ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి అంటూ స్పందించే నారా లోకేష్… ఎక్కడో ఒక చోట ఒక వైసీపీ కార్యకర్త జగన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తే…. చూశారా జగన్‌ పాలన సొంత మనుషులకే నచ్చలేదని ట్వీట్టు పెట్టే నారా లోకేష్… గత కొద్దిరోజులుగా ఉలుకుపలుకు లేరు. ట్విట్టర్‌ను కేవలం జన్మదిన శుభాకాంక్షలు, సంతాపాలకే పరిమితం అవుతున్నారు.

తమ సొంత అమరావతిలో రైతుల ఆందోళనపై మాత్రం నారా లోకేష్ స్పందించడం లేదు. పవన్ కల్యాణ్‌ది కూడా అదే తీరు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి చిన్న పనికి ట్విట్టర్‌లో గోల చేసే లోకేష్, పవన్ కల్యాణ్‌లు… ఇప్పుడెందుకు రాద్దాంతం చేయడం లేదు అని చర్చించుకుంటున్నారు.

విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు ఆందోళనలను నిర్వహిస్తుండడం, దాన్ని తెలుగుదేశం మీడియా బాగా ప్రచారం చేస్తుండడంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన ఇప్పటికే చంద్రబాబును పట్టిపీడిస్తోంది.

ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లో టీడీపీ పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో నారా లోకేష్ గప్‌చుప్‌ అయినట్టు చెబుతున్నారు. అందువల్లే ట్విట్టర్‌లో రాజధాని వార్తలపై నారా లోకేష్ స్వీయ నిషేధం విధించుకున్నారు.

సొంత అన్న చిరంజీవి … మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలపడంతో పవన్ కల్యాణ్‌ ఇరుకునపడ్డారు. దాంతో జబర్దస్త్ మాజీ జడ్జ్, సోదరుడు నాగబాబును పవన్ కల్యాణ్‌ రంగంలోకి దింపారు. నాగబాబు రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. జగన్‌పై జోకులు వేస్తున్నారేగానీ పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి పెద్దగా స్పందించడం లేదు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ముగ్గురూ ఈ అంశంపై వీలైనంత మౌనంగా ఉండడానికి కారణం తేడా వస్తే తొమ్మిది జిల్లాల్లో రాజకీయంగా చాపచుట్టేయాల్సి ఉంటుందన్న భయమే.

Tags:    
Advertisement

Similar News