రాజధాని లేఖలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి !
మెగాస్టార్ చిరంజీవి పేరిట ఇప్పుడు రెండు లేఖలు వైరల్ అవుతున్నాయి. మొదటి లేఖలో ఆయన మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వార్త అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చింది. ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని చిరంజీవి పూర్తిగా సమర్ధించారు. విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే చిరంజీవి పేరిట ఆదివారం మరో లేఖ హల్‌చల్ చేసింది. ”యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు […]
మెగాస్టార్ చిరంజీవి పేరిట ఇప్పుడు రెండు లేఖలు వైరల్ అవుతున్నాయి. మొదటి లేఖలో ఆయన మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వార్త అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చింది.
ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని చిరంజీవి పూర్తిగా సమర్ధించారు. విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే చిరంజీవి పేరిట ఆదివారం మరో లేఖ హల్‌చల్ చేసింది. ”యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు… ’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్లుగా ఓ ప్రకటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ రెండు లేఖలపై చిరంజీవి ఆడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనను సమర్ధిస్తూ శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే నిజమని…ఆదివారం వచ్చిన లేఖతో తనకు సంబంధం లేదని ఆయన ఆడియో క్లిప్‌లో చెప్పారు. ఆదివారం సర్కులేషన్‌లోకి వచ్చిన లేఖ ఫేక్ లేటర్ అని…శనివారం తాను ఇచ్చిన లేఖ మాత్రమే వాస్తవమని ఆయన చెప్పారు. మొత్తానికి మెగా అభిమానులకు చిరంజీవి పుల్ క్లారిటీ ఇచ్చారు.