అమరావతి భూములను ఎలా వాడాలో మాకు తెలుసు...

అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేయాలంటే లక్షా 9వేల కోట్లు అవసరం అవుతాయని… ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబే రెండు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారన్నారు. 100 అడుగుల పునాది వేయాల్సిన ప్రాంతంలో ఎందుకు రాజధానిని ఎంపిక చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీల కోసం, చుట్టాల కోసం ప్రజలకు సంబంధించిన లక్షల కోట్లు ఖర్చు చేయాలా అని నిలదీశారు. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. రాజధాని ప్రకటనకు […]

Advertisement
Update:2019-12-21 04:47 IST

అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేయాలంటే లక్షా 9వేల కోట్లు అవసరం అవుతాయని… ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబే రెండు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారన్నారు. 100 అడుగుల పునాది వేయాల్సిన ప్రాంతంలో ఎందుకు రాజధానిని ఎంపిక చేశారని ప్రశ్నించారు.

చంద్రబాబు బినామీల కోసం, చుట్టాల కోసం ప్రజలకు సంబంధించిన లక్షల కోట్లు ఖర్చు చేయాలా అని నిలదీశారు. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.

రాజధాని ప్రకటనకు రెండు నెలల ముందే టీడీపీ నేతలు ఇక్కడ ఎలా భూములు కొనగలిగారని ప్రశ్నించారు. రాజధాని ప్రకటనకు రెండు నెలల ముందే రాజధాని ప్రాంతంలో భూములు కొన్నట్టు హెరిటేజ్ సంస్థ కూడా అంగీకరించిందని బొత్స గుర్తు చేశారు.

రాజధాని ఎక్కడ వస్తుందో చంద్రబాబుకు తెలుసు కాబట్టే రెండు నెలల ముందు హెరిటేజ్ సంస్థ భూములు కొన్నదని బొత్స వివరించారు. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కాదా అని నిలదీశారు.

కొందరి కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదని… ఐదు కోట్ల ప్రజలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలుంటాయన్నారు. అమరావతిలోని 33 వేల ఎకరాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వానికి తెలుసన్నారు. రైతులకు గత ప్రభుత్వం చెప్పినట్టుగానే అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతుల భూములు వెనక్కు ఇస్తామన్నది కేవలం అసైన్డ్‌ భూముల గురించి మాత్రమేనని… బొత్స కవర్ చేశారు. అసైన్డ్ భూములు కొన్న వారికి లబ్ధి చేకూర్చే ప్రసక్తే లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News