రాజధాని భూములు వెనక్కి ఇచ్చేస్తున్నాం... పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో బాంబు పేల్చారు. రైతులకు 33 వేల ఎకరాల భూమి వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటించారు.ఎన్నికల ముందు కూడా జగన్‌మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో లేజిస్లేటివ్ కేపిటల్ కు 500 ఎకరాలు చాలు అని వ్యాఖ్యానించారు. 33వేల ఎకరాల భూమి అవసరం లేదన్నారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న వారంతా టీడీపీ కార్యకర్తలేనని చెప్పారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ, సచివాలయం 200 ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్నాయని.. కాబట్టి అమరావతిలో లేజిస్లేటివ్ కేపిటల్ కు […]
అమరావతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో బాంబు పేల్చారు. రైతులకు 33 వేల ఎకరాల భూమి వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటించారు.ఎన్నికల ముందు కూడా జగన్‌మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు.
అమరావతిలో లేజిస్లేటివ్ కేపిటల్ కు 500 ఎకరాలు చాలు అని వ్యాఖ్యానించారు. 33వేల ఎకరాల భూమి అవసరం లేదన్నారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న వారంతా టీడీపీ కార్యకర్తలేనని చెప్పారు.
హైదరాబాద్‌లో అసెంబ్లీ, సచివాలయం 200 ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్నాయని.. కాబట్టి అమరావతిలో లేజిస్లేటివ్ కేపిటల్ కు 500 ఎకరాలు సరిపోతుందని వ్యాఖ్యానించారు. తన మనుషుల కోసమే చంద్రబాబు రాజధానిని అమరావతిలో పెట్టారని పెద్దిరెడ్డి ఆరోపించారు.