ఉన్నావ్‌ రేప్‌ కేసు నిందితుడికి జీవిత ఖైదు

ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ కు న్యాయస్థానం యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆయన బ్రతికినంత కాలం జైలులోనే ఉండాలని పేర్కొంది. బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు తీర్పు చెప్పింది. నిర్భయ సంఘటన తరువాత అంతకు మించి దారుణాతి దారుణమైన కేసు ఇది. ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమె తండ్రిని పోలీస్‌ స్టేషన్‌లో నిర్భంధించి… లాకప్‌లోనే చంపేశారు. […]

Advertisement
Update:2019-12-20 11:05 IST

ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ కు న్యాయస్థానం యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆయన బ్రతికినంత కాలం జైలులోనే ఉండాలని పేర్కొంది. బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు తీర్పు చెప్పింది.

నిర్భయ సంఘటన తరువాత అంతకు మించి దారుణాతి దారుణమైన కేసు ఇది. ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమె తండ్రిని పోలీస్‌ స్టేషన్‌లో నిర్భంధించి… లాకప్‌లోనే చంపేశారు. ఆమె కోర్టుకు వెళుతుంటే ఆ వాహనానికి యాక్సిడెంట్ చేసి ఆమె బంధువులిద్దరి మరణానికి కారణం అయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలు, ఆమె లాయర్‌ కూడా గాయపడ్డారు.

కొన్నిరోజులు కూడా గడవకముందే ఈ కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వస్తుంటే ఆమెను సజీవ దహనం చేశారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌కు విధించిన యావజ్జీవ జైలు శిక్ష అతను పాల్పడ్డ నేరాలతో పోలిస్తే చాలా తక్కువ శిక్షే.

Tags:    
Advertisement

Similar News