పాక్ జాదూ స్పిన్నర్ కు వింత సమస్య

భారత్ తో టెస్ట్ సమరానికి తహతహ టెస్ట్ క్రికెట్లో పాకిస్థాన్ చాంపియన్ బౌలర్, 82 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 సాధించిన మొనగాడు యాసిర్ షాకు వింతదిగులు పట్టుకొంది. ప్రపంచ టెస్ట్ నంబర్ వన్ టీమ్ భారత్ తో టెస్ట్ మ్యాచ్ ఆడకుండానే తన కెరియర్ ముగిసిపోతుందేమోనని భయపడిపోతున్నాడు. భారత్ మినహా మిగిలిన ప్రత్యర్థిజట్ల పైన అత్యుత్తమంగా రాణించిన లెగ్ స్పిన్ -గుగ్లీ బౌలర్ యాసిర్ షాకు 37 టెస్టుల్లో 207 వికెట్లు పడగొట్టిన […]

Advertisement
Update:2019-12-18 06:25 IST
  • భారత్ తో టెస్ట్ సమరానికి తహతహ

టెస్ట్ క్రికెట్లో పాకిస్థాన్ చాంపియన్ బౌలర్, 82 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 సాధించిన మొనగాడు యాసిర్ షాకు వింతదిగులు పట్టుకొంది.

ప్రపంచ టెస్ట్ నంబర్ వన్ టీమ్ భారత్ తో టెస్ట్ మ్యాచ్ ఆడకుండానే తన కెరియర్ ముగిసిపోతుందేమోనని భయపడిపోతున్నాడు.

భారత్ మినహా మిగిలిన ప్రత్యర్థిజట్ల పైన అత్యుత్తమంగా రాణించిన లెగ్ స్పిన్ -గుగ్లీ బౌలర్ యాసిర్ షాకు 37 టెస్టుల్లో 207 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

33 సంవత్సరాల వయసులోనూ అసాధారణంగా రాణిస్తున్న యాసిర్ షా మాత్రం… ఎన్ని ప్రత్యర్థిజట్లతో ఆడినా రాని తృప్తి, మజా భారత్ తో తలపడితేనే ఉంటుందని… విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత్ టాపార్డర్ కు బౌల్ చేయటమే తన సత్తాకు తగిన పరీక్షని నమ్ముతున్నాడు.

ఐసీసీ టెస్ట్ లీగ్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన రెండోటెస్టులో యాసిర్ షా ఫైటింగ్ సెంచరీతో తనలో ఓ ఆల్ రౌండర్ సైతం దాగి ఉన్నాడని చాటుకొన్నాడు.

భారత్ ప్రత్యర్థిగా ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడినా ఓ క్రికెటర్ గా తన జన్మధన్యమవుతుందని నమ్ముతున్నాడు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సంఘటన తర్వాత భారత్-పాక్ క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి.

2012లో చివరిసారిగా భారత్ పర్యటనకు వచ్చిన పాక్ జట్టు పూర్తిగా సిరీస్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News